దసరా ఉత్సవాల్లో ఏనుగుల బీభత్సం.. జనాలపైకి.. - జంబూ సవారీ
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలోని శ్రీరంగపట్నం దసరా ఉత్సవాల్లో (Dasara Festival) ఏనుగులు హల్చల్ చేశాయి. ఊరేగింపుగా తీసుకెళ్తున్న సమయంలో పేల్చిన టపాసుల శబ్దానికి ఏనుగులు భయపడిపోయాయి. దీంతో జనాలపై దూసుకెళ్లి వారిని హడలెత్తించాయి (Elephant Viral Video). అనంతరం ఏనుగుల వైద్యులు, మావటిలు వాటిని అదుపులోకి తీసుకొచ్చారు. జంబూ సవారీ (Jamboo Savari) లేకుండానే ఉత్సవాన్ని పూర్తిచేశారు నిర్వాహకులు.