మంచు దుప్పటిలో ఫైన్ వృక్షాల సొగసు చూడతరమా! - జమ్ముకశ్మీర్
🎬 Watch Now: Feature Video
జమ్ముకశ్మీర్ ఎగువ హిమాలయ శ్రేణుల్లోని డోడా ప్రాంతంలో మంచు కురుస్తోంది. హిమపాతంలో తడిసిన ఫైన్ వృక్షాలు ధవళ వర్ణ శోభను సంతరించుకుని ఆకట్టుకుంటున్నాయి. రోడ్లపై భారీగా మంచు మేటలు వేయడం వల్ల.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పెద్దఎత్తున పేరుకుపోయిన మంచును అధికారులు తొలగిస్తున్నారు. మరోవైపు ఉష్లోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోతున్నాయి. ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు.