జోర్దార్గా జల్లికట్టు- 700 బసవన్నలతో యువకుల పోరు - alanganalluru jallikattu news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5738187-thumbnail-3x2-img.jpg)
సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టు తమిళనాట ఉత్సాహంగా సాగుతోంది. మధురై జిల్లా అలంగనళ్లూరులో జల్లికట్టు పోటీలు ఉదయమే ప్రారంభమయ్యాయి. 700 బసవన్నలను నియంత్రించేందుకు యువకులు పోటీ పడుతున్నారు. గాయాలను సైతం లెక్క చేయడం లేదు. ఎద్దులను అదుపులోకి తెచ్చే క్రమంలో గాయపడిన యువకులకు అక్కడికక్కడే చికిత్స అందించేందుకు ప్రాథమిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. జల్లికట్టును చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. యువకులను ఉత్సాహపరుస్తున్నారు. పోటీల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేసిన అధికారులు 2 వేల మంది పోలీసులను మోహరించారు.