కేరళలో తుపాను బీభత్సం- కుప్పకూలిన భవనం - రెండు అంతస్తుల బిల్డింగ్ కూలిన ఘటన
🎬 Watch Now: Feature Video
తుపాను ధాటికి కేరళలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. కాసర్గోడ్ జిల్లా చేరంగాయ్ తీర ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. వర్షాల ధాటికి ఇక్కడి ఓ రెండతస్తుల భవనం కుప్పకూలింది. అయితే.. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భవనం కూలడానికి ముందే అందులో నివసించే కుటుంబాలు ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి వెళ్లాయి. భారీ వర్షాలకు చేరంగాయ్ ప్రాంతంలోని చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. సహాయ చర్యల నిమిత్తం.. 35 మంది సైనికుల బృందం రంగంలోకి దిగింది.
Last Updated : May 15, 2021, 5:21 PM IST