మా మంచి 'మంచు గణపయ్య'! - వినాయక చవితి వేడుకలు
🎬 Watch Now: Feature Video
తమిళనాడులో.. మంచు గణేశుడు ఆకట్టుకుంటున్నాడు. థేని జిల్లాకు చెందిన గణపతి విగ్రహ కళాకారుడు ఇలాంచెళియాన్.. ఏటా వినూత్న పదార్థాలతో విఘ్నేశ్వరుడి ప్రతిమలను తయారు చేస్తాడు. ఈ సారి సుమారు 50 కిలోల మంచుగడ్డతో.. మూడు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పున్న వినాయక విగ్రహాన్ని కేవలం అరగంటలో రూపొందించాడు. నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత ఈ మంచు గణేశుడు కరిగిపోయినట్టే, కరోనా మాయమైపోవాలని కోరుకుంటున్నాడు ఇలాంచెళియాన్.