అర్ధరాత్రి అతిథిగా వచ్చిన మొసలి.. పరుగులు తీసిన జనం - ఉత్తరాఖండ్​లో మొసలి కలకలం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 5, 2020, 9:47 PM IST

ఉత్తరాఖండ్‌లో జనావాసాల్లోకి వచ్చిన ఓ మొసలి కలకలం సృష్టించింది. ఉదంసింగ్‌ నగర్‌లోని సితారగంజ్‌లో రాత్రిపూట ఓ ఇంట్లోకి మొసలి ప్రవేశించడాన్ని స్థానికులు గుర్తించి పరుగులు తీశారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు దాన్ని పట్టుకొని దగ్గరలోని ఓ ఆనకట్టలో వదిలేశారు. స్థానికంగా ఉన్న నదుల్లో నీటి మట్టం పెరగడంవల్లే మొసళ్లు ఇలా తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.