సలసల కాగే నూనె నుంచి గారెలు చేతితో తీసి..! - వేడివేడి నూనె నుంచి గారెలు తీస్తున్న పూజారి
🎬 Watch Now: Feature Video
సాధారణంగా వంట చేసేటప్పుడు నూనె తుంపర్లు మీద పడితేనే అమ్మో అయ్యో అంటుంటారు చాలా మంది. అయితే కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లా కుమ్తా తాలుకాలోని దేవగిరి ఆలయంలో ఓ పూజారి చేసిన పని చూస్తే అవాక్కవ్వక తప్పదు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిషాసుర మర్దినికి ఆలయంలోనే నైవేద్యం తయారు చేశారు నిర్వాహకులు. ఆలయ పూజారి సలసల కాగే నూనె నుంచి వేగుతున్న గారెలను తన చేతులతో తీసి దేవికి అర్పించారు. ఇది చూసి భక్తులు నివ్వెరపోయారు. అయితే ఈ కార్యక్రమం ఏటా జరుగుతుందని నిర్వాహకులు చెప్పారు.