శ్రీమహాలక్ష్మి అమ్మవారికి 16కేజీల పసిడి చీరతో అలంకరణ - gold saree
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4696476-390-4696476-1570601675722.jpg)
దసరా నవరాత్రుల సందర్భంగా పుణెలోని శ్రీమహాలక్ష్మి అమ్మవారిని 16కేజీల పసిడి చీరతో అలంకరించారు. ఏడాదికి రెండు సార్లు మాత్రమే అమ్మవారికి ఈ బంగారు చీరను అలంకరిస్తారు. విజయదశమి, లక్ష్మీపూజ సందర్భంగా పసిడి చీరలో మహాలక్ష్మి దేవి
కాంతులీనుతారు. కనకపు చీరలోని అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ‌్యలో భక్తులు హాజరయ్యారు. దక్షిణ భారత దేశానికి చెందిన కళాకారులు 8 ఏళ్ల క్రితం ఆరు నెలలు శ్రమించి ఈ పసిడి చీరను రూపొందించారు.