అత్త గొంతు కోసి.. సంచిలో కుక్కి.. - మహారాష్ట్రాలో అత్తను చంపి సంచిలో కుక్కిన ఘటన
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర పుణె జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. కోడలే అత్తను చంపి పొదల్లో పడేసింది. తెలెగావ్ ప్రాంతానికి చెందిన బేబీ గౌతమ్ శిందే(50), అమె కోడలు పూజా మిలింద్ శిందే మధ్య చిన్న వాగ్వదం జరిగింది. ఆగ్రహానికి గురైన కోడలు అత్తను గొంతు కోసి చంపేసింది. ఆపై బస్తాలో కుక్కి పొదల్లో పడేసింది. ఎలాంటి ఆధారాలు లభించకుండా భర్త మిలింద్ శిందే నిందితురాలికి సహకరించాడు. రక్తం మరకలను శుభ్రం చేశాడు. పొదల్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానిక యువత పోలీసులకు పిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఆధారాలతో అసలు విషయం బయటపెట్టారు. కోడలును, భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Last Updated : May 24, 2021, 8:20 PM IST