ఆవిర్భావ వేడుకల్లో అపశ్రుతి.. ఊడి సోనియా చేతిలో పడ్డ కాంగ్రెస్ జెండా! - కాంగ్రెస్ పార్టీ అవతరణలో కింద పడ్డ జెండా
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14029340-thumbnail-3x2-flag.jpg)
Congress Flag Fall: కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత్రి సోనియా గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరిస్తున్న సమయంలో జెండా ఊడి పడింది. తాడును కార్యాలయ సిబ్బంది గట్టిగా లాగడం వల్ల జెండా ఊడి సోనియా గాంధీ చేతుల్లో పడింది. అయితే సమయస్ఫూర్తితో వ్యవహరించిన సోనియా జెండాను పైకెత్తి శ్రేణులకు చూపించి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా , మల్లిఖార్జున ఖర్గే సహా ఇతర నేతలు పాల్గొన్నారు.