చిరుతను ఓడించిన కుక్క.. పరారైన చిరుత! - చిరుత
🎬 Watch Now: Feature Video
కర్ణాటక చిత్రదుర్గలోని కుంచిగనల్ ప్రాంతంలో కుక్కపై చిరుత పంజా విసిరింది. వెనుక నుంచి ఒక్కసారిగా కుక్కపై దూకింది చిరుత. కానీ దాడి జరిగే లోపే తేరుకున్న కుక్క వెనక్కి తిరిగి ప్రతిదాడి చేసింది. చిరుత తేరుకుని తిరిగి దాడి చేసినా కుక్క దీటుగా ఎదుర్కొంది. చేసేది లేక వెళ్లిపోయింది చిరుత. కుక్క ఎంచక్కా తనదారి పట్టింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.