ETV Bharat / state

1109 కుటుంబాలు - 190 మంది ఉద్యోగులు - పేదరికంలోంచి పుట్టుకొచ్చిన కసి - A VILLAGE FAMILIES GET GOVT JOBS

పేదరికంలో పుట్టుకొచ్చిన కసి - ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పలువురికి ఆదర్శం

Kistapuram Village Families Get Government Jobs
Kistapuram Village Families Get Government Jobs (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Updated : 1 hours ago

Kistapuram Village Families Get Government Jobs : పదేళ్ల క్రితం కిష్టాపురంగా చలామణిలో ఉన్న గ్రామం ప్రస్తుతం పెద్దకిష్టాపురం, చిన్నకిష్టాపురం పంచయతీలుగా ఎదిగాయి. ప్రస్తుతం పెద్దకిష్టాపురంలో 653, చిన్నకిష్టాపురం పంచాయతీలో 456 కుటుంబాలు అనగా మొత్తం 1,109 కుటుంబాలు విస్తరించాయి. ఇక్కడ పిల్లలు సెలవుల్లో తల్లిదండ్రులతో పాటు పనిచేస్తూ కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలిచేవారు. అలా పనులు చేస్తున్న వారికి పేదరికాన్ని జయించాలనే కసితో అక్కడి యువతు కష్టపని ప్రభుత్వ కొలువులు సాధించి పలువూరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

గ్రంథాలయాన్నే నివాసంగా మార్చుకున్న యువకుడు - వరుస కట్టిన 5 ప్రభుత్వ ఉద్యోగాలు

ప్రస్తుతం ఆయా గ్రామాల నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా 81మంది, పోలీస్‌శాఖలో 28 ఉద్యోగాలు సాధించారు. బ్యాంకుల్లో ఎనమిది మంది పనిచేస్తున్నారు. డాక్టర్లుగా 6మంది వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులుగా 6మంది కొలువులు సాధించారు. అటవీ శాఖలో ఇద్దరు పని చేస్తున్నారు. తంతి తపాలా ఉద్యోగులుగా ఇద్దరు, ప్రొఫెసరుగా ఒక్కరు, అసిస్టెట్‌ ప్రొఫెసరుగా ఒకరు, జూనియర్‌ అసిస్టెంట్లుగా ఇద్దరు, కేజీబీవీలో ఉపాధ్యాయులుగా 5మంది, ఏఈవోగా ఒక్కరు, బీహెచ్‌ఈఎల్‌లో ఒక్కరు, ఏఈగా ఒకరు, ఐపీఎస్‌లో ఒక్కరు, 13 మంది ఇతర ఉద్యోగాల్లో పని చేస్తున్నారు. 25 మందికి పైగా ఉద్యోగ విరమణ చేసినవారున్నారు. పెద్దకిష్టాపురంలో మొత్తం 70 మంది, అంజనాపురంలో 48మంది, చిన్నకిష్టాపురంలో 43మంది, ప్రభుత్వ ఉద్యోగాల్లో వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారు కూడా ఉన్నారు.

"మాది సామాన్య వ్యవసాయ గిరిజన కుటుంబం. డిగ్రీ దాకా సెలవు రోజుల్లో కూలీ పనులు చేసి కుటుంబానికి సహాయం చేశాను. కష్టపడి చదువుకుని 2018లో కాకతీయ యూనివర్సిటీలో గణితశాస్త్రంలో డాక్టరేట్‌ సాధించాను. రెండుసార్లు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందాను. ప్రస్తుతం గార్ల మండలం అంకన్నగూడెంలో పీఎస్‌లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను." - డాక్టర్‌ చందావత్‌ బాలునాయక్, ప్రధానోపాధ్యాయుడు, అంకన్నగూడెం

"నాది సామాన్య వ్యవసాయ కుటుంబం. ఉన్నత చదువులు చదువుకున్నవారిని ఆదర్శంగా తీసుకున్నా. పట్టుదలతో ఎంఏ ఇంగ్లీష్‌ లిటరేచర్‌, బీఈడీ పూర్తి చేశాను. 2012లో డీఎస్సీలో ఎస్జీటీగా ఉద్యోగం సాధించాను. గార్ల ఏజీహెచ్‌ఎస్‌లో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. ప్రస్తుతం తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శింగా కొనసాగుతున్నా." - గంగావత్‌ శ్రీనివాస్, ఏజీహెచ్‌ఎస్‌ ఉపాధ్యాయుడు, గార్ల

ఆ '1' మార్కు - 4 ప్రభుత్వ ఉద్యోగాలను తెచ్చిపెట్టింది

ఇంటర్‌ అర్హత తోనే సర్కారీ కొలువులు - ఎలాగో తెలుసుకోండి

Last Updated : 1 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.