దిల్లీలో రెచ్చిపోయిన దుండగులు... నడిరోడ్డుపైనే చోరీ! - రాజధాని
🎬 Watch Now: Feature Video
దిల్లీ ప్రేమ్‌నగర్‌కు చెందిన బస్సు డ్రైవర్ అనుజ్ రాత్రి 9 గంటలకు వాహనాన్ని పార్కింగ్ చేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. అంతే.. అదనుచూసిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా అతనిమీద పడ్డారు. గొంతును అదిమిపట్టి డ్రైవర్ నుంచి చరవాణి, 10 వేల రూపాయలు.. ఇతరత్రా వస్తువులు తస్కరించి పరారయ్యారు. సీసీటీవీలో నమోదైన ఈ దృశ్యాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అనుజ్ చాలా సేపటి వరకు అపస్మారక స్థితిలోనే పడిఉన్నాడు. ఆ దారిగుండా కొందరు వెళ్లినప్పటికీ ఆ బాధితుడ్ని పట్టించుకున్నవారే లేరు. దేశ రాజధానిలోనే కనీస భద్రత లేకుంటే.. మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Last Updated : Sep 27, 2019, 6:30 PM IST