జాతీయ నేతకు చెప్పుల దండ, గాడిదపై ఊరేగింపు!
🎬 Watch Now: Feature Video
రాజస్థాన్ జైపుర్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కార్యకర్తలు తమ పార్టీ జాతీయ సమన్వయకర్త రాంజీ గౌతం, రాష్ట్ర మాజీ ఇంఛార్జ్ సీతారాం ముఖాలకు నలుపు రంగు పూసి, గాడిదలపై ఊరేగించారు. లంచానికి లొంగిపోయి తమ పార్టీ టిక్కెట్లను భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులకు అమ్ముకున్నారని ఆరోపించారు. వారి మెడలో చెప్పుల దండ వేసి నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. అయితే, ఆ పార్టీ అధినేత్రి మాయావతి మాత్రం ఇదంతా కాంగ్రెస్ కుట్ర అని మండిపడ్డారు.