దిల్లీలో ఆప్, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ - ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల ఘర్షణ
🎬 Watch Now: Feature Video
దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. గీతా కాలనీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఎస్.కే.బగ్గా కార్యాలయంలో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కార్యాలయంలోకి వచ్చి భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారని, కార్యాలయ సిబ్బందిపై చేయి చేసుకున్నారని ఆప్ కార్యకర్తలు ఆరోపించారు. తూర్పు దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్, భాజపా మెడికల్ సెల్ ఉపాధ్యక్షుడు అనిల్ గోయల్ నేతృత్వంలో కార్యకర్తలు కార్యాలయ ముట్టడి చేసినట్లు ఆప్ నేతలు చెప్పారు.