12వేల టెంకాయలతో నారికేళ గణనాథుడు! - 30feet
🎬 Watch Now: Feature Video
బెంగళూరు పుట్టేనహళ్లిలోని... గణేశ్ మండపంలో ఏటా వివిధ రకాల పదార్థాలను ఉపయోగించి వినాయకుడిని తయారు చేస్తున్నారు. మొదటి సంవత్సరం పత్తితో, రెండో ఏట చెరకు గెడలతో బొజ్జ గణపయ్యను నెలకొల్పారు. తాజాగా 12వేల కొబ్బరికాయలను ఉపయోగించి నారికేళ గణనాథుడిని తయారు చేశారు. 30 అడుగుల పొడవున్న ఈ గణపతిని తయారుచేయడం కోసం 50 మంది వ్యక్తులు 21 రోజులపాటు శ్రమించారు. ఈ గణపతి నిమజ్జనమెలా అన్న అనుమానం కలుగతుందా... మూడు రోజులపాటు పూజలందుకున్నాక ఈ లంబోదరుడిని... ప్రసాదం రూపంలో పదిలంగా ఉదరాలకు చేర్చడమే...!
Last Updated : Sep 28, 2019, 7:59 PM IST