బస్సు దగ్ధం- డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులు సేఫ్ - bus fire accident in Maharashtra
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9555528-thumbnail-3x2-bus-fire.jpg)
మహారాష్ట్రలోని ధూలే-సూరత్ జాతీయ రహదారిపై సోన్ఖాంబ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఔరంగబాద్ నుంచి అహ్మదాబాద్‌కు 40మంది ప్రయాణికులతో వెళ్తోన్న లగ్జరీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తమైన డ్రైవర్.. బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే బస్సు మంటల్లో కాలి బూడిదైంది.
Last Updated : Nov 16, 2020, 10:30 AM IST