బిడ్డల కోసం చిరుత ఫైట్​.. పర్యటకులను తరిమిన రైనో - చిరుత వైరల్ వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 23, 2021, 7:58 PM IST

Animal viral videos: ఓ ఆడ చిరుత తన బిడ్డలను కాపాడుకునేందుకు మగ చిరుతతో తలపడింది. కాజోడ్ అనే మగ చిరుత- జలేబీ మధ్య భీకర పోరు జరిగింది. ఈ పోరులో జలేబీ దెబ్బకు కాజోడ్ తోక ముడిచింది. రాజస్థాన్ జైపుర్​లోని​ ఝలానాలో చిరుత పులి సంరక్షణ కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. మరోవైపు.. అసోం కాజీరంగా జాతీయ పార్కులో ఓ ఖడ్గమృగం బీభత్సం సృష్టించింది. పర్యటకుల వాహనాన్ని వెంటపడి తరిమింది. కహారా రేంజ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఈ రెండు వీడియోలు.. నెట్టింట ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.