నీట మునిగిన పట్టాలు.. రైల్లోనే వందలాది ప్రయాణికులు - ముంబయి
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బద్లాపుర్-వాంగణీ మధ్య పట్టాలు నీట మునిగి మహాలక్ష్మి ఎక్స్ప్రెస్ ఈ రోజు తెల్లవారుజాము నుంచి మార్గమధ్యంలోనే నిలిచిపోయింది. ఆ సమయంలో రైల్లో 700 మందికి పైగా ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, నావికా సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రయాణికులకు నీరు, బిస్కెట్లు అందజేశారు. నేవీ హెలికాప్టర్లు, పడవల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.