పంజాబ్ వీధుల్లో పరుగులు పెట్టించి మరీ..!
🎬 Watch Now: Feature Video
ఫోన్ దొంగలించేందుకు వచ్చిన కేటుగాళ్లను పరుగులు పెట్టించి మరీ పట్టుకుంది ఓ 15 ఏళ్ల బాలిక. పంజాబ్ జలంధర్ నగరంలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ నగర్లో కుసుమ కుమారి నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి ఆమె ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. ప్రతిఘటించిన బాలిక అందులో ఒకరిని బైక్ ఎక్కకుండా నిలువరించింది. దుండగుడు దాడి చేస్తున్నప్పటికీ వెరవకుండా పోరాడింది. బైక్ వెనుక పరిగెత్తి మరీ కేటుగాళ్లను పట్టుకునే ప్రయత్నం చేసింది. ఇది చూసిన చుట్టుపక్కలవారు ఆ దుండగుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలిక ధైర్యాన్ని కొనియాడారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.