వామ్మో.. 14 అడుగుల భారీ తాచుపాము - 14 Feet long Snake news
🎬 Watch Now: Feature Video
తమిళనాడు కోయంబత్తూర్‌లో 14 అడుగుల భారీ తాచుపాము దర్శనమిచ్చింది. బూలువంపట్టిలో ఉన్న ఈశా యోగా కేంద్రం వెనుక భాగంలో కొందరు స్థానికులు ఈ భారీ సర్పాన్ని గుర్తించారు. వెంటనే అటవీ అధికారులను అప్రమత్తం చేశారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి రక్షణ కవచాలు లేకుండానే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫలితంగా ఈశా యోగా కేంద్రంలోని వాలంటీర్లే పామును ఎంతో ఓపిగ్గా ఒడిసి పట్టేశారు. అనంతరం అడవిలో విడిచిపెట్టారు.