రోడ్డుపై రిటైర్డ్ కలెక్టర్ కుమారుడు వీరంగం.. యువకుడ్ని ఢీకొట్టి.. - రోడ్డుపై కలెక్టర్ కుమారుడు రచ్చరచ్చ
🎬 Watch Now: Feature Video
దిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు నడుపుతున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కుమారుడు ఓ యువకుడ్ని బలంగా ఢీకొట్టి కొద్దిదూరం ఈడ్చుకెళ్లాడు. అనంతరం అక్కడ ఆగకుండా వేగంగా పారిపోయాడు. ఈ దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. బాధితుడ్ని విజయ్ మాండలియాగా గుర్తించామని.. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు పోలీసులు. ప్రమాదానికి కారణమైన కారు మాజీ ఐఏఎస్ అధికారి కల్యాణ్ సుందరం పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన అనంతరం తండ్రీ కొడుకులు ఇద్దరూ ఫోన్లు స్విచ్ఛాఫ్ పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కల్యాణ్ సుందరం.. కుమారుడికి సహకరించే యత్నం చేసినట్లు వివరించారు. నిందితుడ్ని అరెస్ట్ చేశామన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST