చెరువులో గేదె దిగిందని.. మహిళను నీటిలో ముంచి.. విచక్షణారహితంగా.. - మహిళను నీటిలో ముంచి చితకబాదిన ఇద్దరు వ్యక్తులు
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని మిర్ఖానగర్లో దారుణం జరిగింది. చెరువులోకి గేదె వెళ్లిందని ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రికులైన ఇద్దరు వ్యక్తులు.. ఇద్దరు మహిళలపై దాడికి దిగారు. అందులో ఓ మహిళను నీటిలో ముంచుతూ విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనపై బాధితులు నిగోహ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సెప్టెంబరు 4న జరిగిందీ ఘటన. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST