అంధ యువతుల ఫ్యాషన్​ షో అదరహో - Institute of Fashion and Jewellery Design

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 19, 2022, 2:29 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

గుజరాత్​లో అంధ యువతుల ఫ్యాషన్​ షో ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. ఆదివారం రాత్రి రాజ్​కోట్​లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్​ జ్యువెలరీ డిజైన్ ఆధ్వర్యంలో ఈ లాక్మే ఫ్యాషన్​ షో జరిగింది. ఈ షోలో పాల్గొన్న వారంతా దృష్టిలోపం ఉన్నవారే. వారిలో కొందరు సహాయకులతో స్టేజ్ ​పైకి వచ్చి సందడి చేశారు. రకరకాల దుస్తులతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ షో కోసం ఐఎఫ్​జేడీ సభ్యులు ఆ అంధ యువతులతో 15 నుంచి 20 రోజుల పాటు సాధన​ చేయించారు. షోలో పాల్గొన్న వారంతా నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.