మువ్వన్నెల వెలుగుల్లో వెలిగిపోతున్న జలాశయాలు - జలాశయాల వద్ద మువ్వన్నెల సందడి
🎬 Watch Now: Feature Video
స్వాతంత్య్ర వజ్రోత్సవాలు దేశవ్యాప్తంగా నేత్రపర్వంగా సాగుతున్నాయి. వాడవాడలు జాతీయ పతాకాలతో త్రివర్ణ శోభితంగా మారగా ప్రముఖ కట్టడాలు, జలాశయాలు విద్యుత్ దీపాలతో వెలుగులీనుతున్నాయి. కృష్ణమ్మ పరుగులతో జలకళ సంతరించుకున్న నాగార్జున సాగర్ జలాశయానికి ప్రత్యేక విద్యుత్ దీప కాంతులు ఏర్పాటు చేశారు. త్రివర్ణశోభితంగా మారిన జలాశయం 26 గేట్ల ద్వారా కృష్ణమ్మ కిందకు దూకుతున్న దృశ్యాలు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. అటు దిగువమానేరు డ్యామ్ కూడా మూడురంగులతో అలంకరించుకొని పర్యాటకులను ఆహ్వానిస్తోంది.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST