ఎమ్మెల్యే బంధువుల వేధింపులు.. స్టేషన్లో వెక్కివెక్కి ఏడ్చేసిన కానిస్టేబుల్ - ఎమ్మెల్యే వేధింపులు పోలీస్
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్‌లో భాజపా ఎమ్మెల్యే అశుతోశ్ శుక్లా బంధువులు వేధించడం వల్ల ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కన్నీళ్లుపెట్టుకున్నారు. పోలీస్ స్టేషన్లోనే వెక్కివెక్కి ఏడ్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. సైరన్లతో వెళ్తున్న వాహనాలను అడ్డగించి, ఫొటోలు తీయాలని ప్రయత్నించడమే ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన తప్పు! 'మా వాహనాలనే అడ్డగిస్తావా' అంటూ కానిస్టేబుల్‌తో గొడవపడ్డారు ఎమ్మెల్యే బంధువులు. కానిస్టేబుల్‌ను గట్టిగా బెదిరించి.. స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి పంచాయతీ పెట్టారు. పోలీస్ స్టేషన్లోనూ తమ కావరాన్ని ప్రదర్శించారు ఎమ్మెల్యే బంధువులు. ఈ క్రమంలో కానిస్టేబుల్ ఏడుస్తూ కనిపించారు. పక్కన ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్రను చక్కగా పోషించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ.. పోలీసు ఉన్నతాధికారులెవరూ స్పందించకపోవడం గమనార్హం.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST