ముస్లిం పెళ్లిలో 'బుల్డోజర్ బరాత్'.. అంతా యోగి మహిమ! - బుల్డోజర్​పై బరాత్ ముస్లిం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 19, 2022, 4:36 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

UP bulldozer baraat: ఉత్తర్​ప్రదేశ్​లో ఈమధ్య ఎక్కడ చూసినా 'బుల్డోజర్' మాటే వినిపిస్తోంది. అయితే, ఇది నేరస్థుల ఇళ్లను ప్రభుత్వాలు కూల్చేయడానికే పరిమితం అనుకుంటే పొరపాటే! ఇటీవల ఓ ముస్లిం జంట వివాహ వేడుకలోనూ బుల్డోజర్ కనిపించింది. శనివారం బాద్షా-రుబీనా వివాహం జరగ్గా.. పెళ్లి బరాత్​లో బుల్డోజర్​ను ఉపయోగించారు. బాద్షాను అందంగా అలంకరించిన బుల్డోజర్​పై ఊరేగించారు. బహ్రాయీచ్ జిల్లాలో ఈ వినూత్న వేడుక జరిగింది. దీన్ని చూసి స్థానికులు 'బుల్డోజర్ బాబాకీ జై' అంటూ నినాదాలు చేశారు. బాద్షా-రుబీనా వివాహాన్ని గుర్తుండిపోయేలా చేసేందుకు ఇలా బుల్డోజర్​ను ఉపయోగించినట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు, ఈ ఘటనపై స్పందిస్తూ.. రాష్ట్రంలో సుపరిపాలనకు బుల్డోజర్ చిహ్నంలా మారిందని బహ్రాయీచ్ సదర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనుపమా జయస్​వాల్ (భాజపా) పేర్కొన్నారు. బుల్డోజర్​ను చూసి నేరస్థులే భయపడుతున్నారని చెప్పుకొచ్చారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.