తండ్రిని తోపుడుబండిపై ఆస్పత్రికి తీసుకెళ్లిన ఏడేళ్ల కొడుకు.. అంబులెన్సు లేక.. - తోపుడుబండిపై ఆస్పత్రిని తండ్రిని తీసుకెళ్లిన

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 12, 2023, 7:40 AM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

మధ్యప్రదేశ్​లోని సింగ్రౌలీ జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని అతడి భార్య, ఏడేళ్ల కుమారుడు.. తోపుడుబండిపై ఆస్పత్రికి తీసుకెళ్లారు. తమ ప్రాంతానికి అంబులెన్స్​ రాకపోవడం వల్ల మూడు కిలోమీటర్లు.. బండిని తోసుకుంటూ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. బాధితుడు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడని, 20 నిమిషాలైనా అంబులెన్స్​ రాలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని ఏడీఎం డీపీ బర్మన్​ తెలిపారు. ఘటనకు కారకులైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.