పేదల వైద్యం కోసం సాయి బాబా ట్రస్ట్​కు భారీ విరాళం - షిర్డీ బాబా ఆలయానికి భారీ విరాళం ఇచ్చిన భక్తులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 23, 2022, 3:15 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆస్థానానికి అమెరికా కాలిఫోర్నియా నుంచి వచ్చిన ఓ భక్తుడు యాభై వేల డాలర్లను విరాళంగా ఇచ్చారు. భారత కరెన్సీలో ఇది దాదాపు 41 లక్షల రూపాయలకు సమానం. ఆసుపత్రిలోని పేదల వైద్యం కోసం డాక్టర్ అఖిల్ శర్మ, డాక్టర్ అపర్ణ శర్మ సాయి ఇనిస్టిట్యూట్‌కు ఈ విరాళాన్ని అందించారు. తామిచ్చిన విరాళం పేదలకు వైద్యం అందించడానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు డాక్టర్‌ అఖిల్‌ శర్మ తెలిపారు. తమ కుటుంబంలో అంతా వైద్యులు అయినందున వైద్య నిధికి ఈ విరాళం ఇచ్చినట్లు డాక్టర్‌ అపర్ణ శర్మ తెలిపారు. తామంతా బాబా భక్తులమని వెల్లడించారు. ఈ విరాళాన్ని సాయి సంస్థాన్‌కు చెక్కు ద్వారా అందించిన తరువాత ఈ ధార్మిక భక్తులను సాయి ట్రస్ట్ సత్కరించింది.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.