కారు బంపర్లో ఇరుక్కున్న కుక్కను చూసుకోకుండా 70 కిలోమీటర్లు ప్రయాణం - Viral videos
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఓ కుక్కను కారు ఢీకొట్టింది. అనంతరం ఆ కుక్క కారు బంపర్లో ఇరుక్కుపోయింది. వెంటనే కారు దిగిన ఓనర్.. చుట్టు చూశాడు. అతడికి ఏమీ కనిపించలేదు. దీంతో కారులో 70 కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి వెళ్లాడు. అనంతరం బంపర్లో కుక్కను గుర్తించాడు. వెంటనే మెకానిక్ దగ్గరకు కారును తీసుకువెళ్లి.. బంపర్ విప్పించి కుక్కను బయటకు తీశాడు. కుక్కకు చిన్న గాయం కూడా కాకపోవడం గమనార్హం. పుత్తూరు తాలూక కబకాకు చెందిన కుక్కే సుబ్రమణ్యం అనే వ్యక్తి.. తన భార్య కలిసి గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సుళ్య తాలూకాలోని బల్ప గ్రామం వద్ద కక్కును కారుతో ఢీ కొట్టాడు సుబ్రమణ్యం. గురువారం ఈ ఘటన జరిగింది.