కుక్కను కిరాతకంగా ఉరితీసిన దుండగులు - గాజియాబాద్​ వీధి కుక్క ఉరి ఘటన

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 14, 2022, 12:49 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో అమానవీయ ఘటన జరిగింది. ఓ కుక్కను ఉరితీసి కిరాతంగా చంపిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అయ్యింది. గోడకు మేకు కొట్టి కుక్క మెడకు తాడు కట్టి వేలాడదీశారు. ఈ వీడియోలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు కుక్క మెడకు మరో తాడు కట్టి అటూ ఇటూ లాగారు. మూడో వ్యక్తి అక్కడే నిల్చున్నాడు. ఎవరో ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనంతరం ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీనిపై జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆటవిక చర్యకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.