ETV Bharat / sukhibhava

కీలు కీలులో నరకం.. ఇలా చేస్తే ఆర్థ్రయిటిస్‌ నుంచి ఉపశమనం! - ఆర్థ్రయిటిస్‌ కీళ్ల నొప్పులు చికిత్స

వస్తువులు పట్టుకుంటాం. బరువులు ఎత్తుతాం. నడుస్తాం. పరుగెత్తుతాం. మెట్లు ఎక్కుతాం. ఇలా రోజంతా ఎన్నెన్నో పనులు అలవోకగా చేసేస్తుంటాం. అయితే ఓసారి వేళ్లు ముడవకుండా వస్తువులను పట్టుకొని చూడండి. నడుం వంచకుండా బరువులెత్తటానికి ప్రయత్నించండి. మోకాళ్లు మడవకుండా కుర్చీలోంచి లేచి, అడుగేయండి. సాధ్యమే కాదు కదా. కీళ్ల గొప్పతనం అదే. పాదాల వేళ్ల దగ్గర్నుంచి మడమలు, మోకాళ్లు, తుంటి, నడుం, మెడ, భుజాలు, మోచేయి, మణికట్టు, చేతి వేళ్ల వరకూ అన్నింటిలోనూ ఇరుసులా కదులుతూ మనల్ని కదిలిస్తాయి. ముందుకు నడిపిస్తాయి. ఇంతటి కీలకమైన కీళ్లలో వాపు, నొప్పి (ఆర్థ్రయిటిస్‌) తలెత్తితే? కాలూ చేయీ కదపటమే కష్టమైపోతుంది. చివరికి జీవితమే నరకప్రాయంగా మారుతుంది. కీళ్ల నొప్పులన్నీ పైకి ఒకేలా అనిపిస్తుంటాయి గానీ వీటిల్లో చాలా రకాలున్నాయి. వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల నొప్పులు అక్కడికే పరిమితమైతే.. కీళ్లవాతం (రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌) సమస్యలు ఇతర భాగాలకూ విస్తరిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర సమస్యలకూ దారితీస్తాయి. అక్టోబర్​ 12న ప్రపంచ ఆర్థ్రయిటిస్‌ దినం సందర్భంగా వీటిపై సమగ్ర కథనం మీకోసం.

world arthritis day 2022
కీలు కీలులో నరకం.. ఇలా చేస్తే ఆర్థ్రయిటిస్‌ నుంచి ఉపశమనం!
author img

By

Published : Oct 12, 2022, 7:53 AM IST

నడుం నొప్పులు, కీళ్ల నొప్పులు సర్వ సాధారణం. వీటిల్లో నడుం పట్టేయటం, శరీర భంగిమ అస్తవ్యస్తం కావటం వల్ల తలెత్తే నొప్పులే ఎక్కువ. వృద్ధాప్యంలో మోకాలు, తుంటి కీళ్లు అరగటం (ఆస్టియో ఆర్థ్రయిటిస్‌) వల్ల ఎంతోమంది బాధ పడుతుండటం చూస్తూనే ఉంటాం. దీనికి మూలం కీళ్ల మధ్యలో రబ్బరులాంటి మృదులాస్థి అరిగిపోవటం. దీంతో కీళ్ల ఎముకలు ఒరుసుకుపోయి నొప్పి పుడుతుంది. అయితే అన్ని కీళ్ల నొప్పులు ఇలాంటి మామూలు సమస్యే కాకపోవచ్చు. కీళ్లవాతం నొప్పులూ ఉండొచ్చు. దెబ్బలు తగలటం, కింద పడటం, బెణకటం వంటి వాటితో తలెత్తే నొప్పులు ఒకట్రెండు వారాల్లోనే కుదురుకుంటాయి. కీళ్లవాతం నొప్పులు దీర్ఘకాలం వేధిస్తాయి. నొప్పులు 6-12 వారాలు దాటినా తగ్గకపోతే కీళ్లవాతమేమోనని అనుమానించటం తప్పనిసరి. ఈ నొప్పుల ప్రత్యేకతే వేరు. ఉదయం పూట నొప్పి ఎక్కువగా ఉంటుంది. తెల్లవారుజామున మెలకువ వచ్చినా వెంటనే లేవటం సాధ్యం కాదు. దీనికి కారణం కీళ్లు బిగుసుకుపోవటం. అర్ధ రాత్రుల్లోనూ నడుం, కీళ్లు పట్టేస్తుంటాయి. నిద్ర లేచాక కనీసం గంట సేపు నడుంలో లేదా కీళ్లలో నొప్పి వేధిస్తూనే ఉంటుంది. మామూలు మోకాళ్ల నొప్పులు గలవారికి పడుకుంటే, కూర్చుంటే హాయిగా ఉంటుంది. కానీ కీళ్లవాతంలో విశ్రాంతితో నొప్పి పెరుగుతుంది. అరగంట, గంటసేపు కదలకున్నా కీళ్లు పట్టేస్తాయి. నొప్పితో పాటు వాపూ ఉంటుంది. అక్కడ వేడిగా, ఎర్రగా ఉంటుంది. తాకితే నొప్పి పుడుతుంది.

గతి తప్పే రక్షణ వ్యవస్థ
కీళ్లవాతానికి ప్రధాన కారణం మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన మీదే దాడి చేయటం (ఆటోఇమ్యూన్‌). మనం జబ్బుల బారినపడకుండా, సూక్ష్మక్రిములు మనపై దాడి చేయకుండా రోగనిరోధక వ్యవస్థ నిరంతరం కాపాడుతుంటుంది. కానీ ఒక్కోసారి ఇది పొరపడుతుంది. మన శరీర భాగాలనే శత్రువులా భావించి దాడి చేస్తుంది. కీళ్లవాతానికి మూలమిదే. మన కీళ్ల చుట్టూ సైనోవియం అనే పొర ఉంటుంది. కీళ్లు తేలికగా కదలటానికి తోడ్పడే జిగురు ద్రవం (సైనోవియల్‌ ఫ్లూయిడ్‌) దీనిలోంచే ఉత్పత్తి అవుతుంది. కీళ్లవాతం గలవారిలో రోగనిరోధక వ్యవస్థ పొరపాటున సైనోవియం పొర మీద దాడి చేస్తుంటుంది. దీంతో అది ఉబ్బిపోతుంది. జిగురు ద్రవం ఉత్పత్తి పెరుగుతుంది. కీళ్లలోకి విషతుల్యాలు చొచ్చుకెళ్తాయి. ఫలితంగా వాపు, నొప్పి వేధిస్తాయి. ఈ ప్రక్రియ ఇంతటితోనే ఆగిపోదు. చుట్టుపక్కల కణజాలానికీ విస్తరిస్తుంది. క్రమంగా కీళ్లు మృదులాస్థి, ఎముక కూడా దెబ్బతింటాయి. వీటి ఆకారం శాశ్వతంగా మారిపోవచ్చు. ఇతరత్రా అవయవాలకూ ప్రమాదం తెచ్చిపెట్టొచ్చు.
ఎందుకిలా?
రోగనిరోధక వ్యవస్థ గతి తప్పటానికి కారణమేంటన్నది కచ్చితంగా తెలియదు. జన్యువులు, పరిసరాల ప్రభావం వంటివి కొంతవరకు దోహదం చేస్తుండొచ్చు. ఏదేమైనా సమస్యను వీలైనంత త్వరగా గుర్తించి, చికిత్స ఆరంభిస్తే కీళ్లు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. రోజువారీ పనులకు విఘాతం కలగకుండా చూసుకోవచ్చు. ఈ రుమటాయిడ్‌ సమస్యల్లో చాలా రకాలున్నాయి. వీటి గురించి తెలుసుకొని ఉండటం మంచిది.

జువైనల్‌ ఇడియోపతిక్‌ ఆర్థ్రయిటిస్‌
దీన్ని పిల్ల కీళ్లవాతం అనుకోవచ్చు. ఇది 16 ఏళ్ల కన్నా చిన్నవారిలోనే వస్తుంటుంది. ఎక్కువగా 2-4 ఏళ్ల వయసులో కనిపిస్తుంటుంది. ఇందులో ఓలిగో, పాలీ, యాంకైలోజింగ్‌, సిస్టమిక్‌, సొరియాటిక్‌ అని మళ్లీ ఐదు రకాలున్నాయి. ఓలిగో ఆర్థ్రయిటిస్‌ నాలుగు, అంతకన్నా తక్కువ కీళ్లకే పరిమితమవుతుంది. ఎక్కువగా మోకాలు, మడమ, మణికట్టు కీళ్లు ప్రభావితమవుతుంటాయి. శరీరంలో ఒకేసారి రెండు వైపులా వేర్వేరు భాగాల్లో నొప్పి రావటం విచిత్రం. పాలీ ఆర్థ్రయిటిస్‌ ఐదు, అంతకన్నా ఎక్కువ కీళ్లకు వస్తుంటుంది. ఇది చాలావరకు రుమటాయిడ్‌ కీళ్లవాతం మాదిరిగానే ఉంటుంది. సిస్టమిక్‌ రకం శరీరంలోని ఇతర భాగాలకూ విస్తరిస్తుంటుంది. దీన్నే స్టిల్స్‌ డిసీజ్‌ అనీ అంటారు. ఇందులో కీళ్ల వాపు, నొప్పులతో పాటు జ్వరం, దద్దు కూడా ఉంటాయి. జ్వరం ఉన్నంతసేపు నీరసంగా, చిరాకుగా ఉంటారు. జ్వరం తగ్గగానే హుషారుగా అయిపోతారు. రెండు వారాలైనా జ్వరం తగ్గకుండా, దద్దు కూడా వస్తూ కీళ్ల నొప్పులు ఉన్నట్టయితే దీన్ని అనుమానించాలి. ఇది కొన్నిసార్లు 16-35 ఏళ్ల వారిలోనూ రావొచ్చు (అడల్ట్‌ ఆన్‌సెట్‌ స్టిల్స్‌ డిసీజ్‌). వీరిలోనూ జ్వరం, దద్దు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సొరియాసిస్‌తో ముడిపడినది మరో రకం. మామూలుగా పెద్దవాళ్లలో సొరియాసిస్‌ తర్వాత కీళ్లవాతం మొదలవుతుంటుంది. కానీ పిల్లల్లో ముందుగా కీళ్లవాతం.. అనంతరం రెండు మూడేళ్లకు చర్మం మీద పొలుసులు వస్తుంటాయి.

నిర్ధరణ: ఓలిగో రకం గలవారిలో యాంటీ న్యూక్లియర్‌ యాంటీబాడీ (ఏఎన్‌ఏ) పాజిటివ్‌గా ఉంటుంది. ఇలాంటి పిల్లలకు ఐరైటిస్‌, యువియైటిస్‌ వంటి కంటి సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువ. చికిత్స చేయకపోతే నీటికాసులు, శుక్లాలు వచ్చే అవకాశముంది. వీరిలో రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌ నెగెటివ్‌గా ఉంటుంది. పాలీఆర్థ్రయిటిస్‌లోనైతే 80% మందికి రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌ పాజిటివ్‌గా ఉంటుంది.

రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ ప్రధానం
కీళ్లవాతం సమస్యల్లో ఎక్కువగా చూసేది రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌. ఇది మగవారిలో కన్నా ఆడవారిలో 3-4 రెట్లు ఎక్కువ. సాధారణంగా ఇందులో చేతులు, కాళ్లలోని కీళ్లలో నొప్పులు, వాపులు మొదలవుతాయి. ముందుగా వేళ్లు, మణికట్టు వంటి చిన్న చిన్న కీళ్లలో సమస్య ఆరంభమవుతుంది. క్రమేపీ మోకాళ్లు, మోచేతులు, భుజాల వంటి పెద్ద కీళ్లకు విస్తరిస్తుంది. అరుదుగా కొందరిలో ఆలస్యంగా మెడలోని కీళ్లల్లోనూ సమస్య తలెత్తొచ్చు. ఒకే సమయంలో ఎక్కువ కీళ్లలో నొప్పి, వాపు ఉంటాయి. శరీరంలోని రెండు పక్కల కీళ్లలోనూ (సిమ్మెట్రికల్‌) నొప్పి, వాపు ఉండటం దీని ప్రత్యేకత. అంటే కుడి మణికట్టులో నొప్పి ఉంటే ఎడమ మణికట్టులోనూ ఉంటుందన్నమాట. చిత్రంగా వేళ్లలో చివరి కీళ్లు మాత్రం ప్రభావితం కావు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌గా అనుమానించాల్సిందే.

ఇది ఒక్క కీళ్ల మీదే కాదు.. తీవ్రమైతే ఇతర అవయవాల మీదా ప్రభావం చూపుతుంది. నిర్లక్ష్యం చేసినకొద్దీ నోరు, కళ్లు, చర్మం పొడిబారొచ్చు (సిక్కా సిండ్రోమ్‌, షోగ్రన్‌ సిండ్రోమ్‌). నోట్లో లాలాజల గ్రంథులు, కంట్లోని కన్నీటి గ్రంథులు ఎడిపోతాయి. దీంతో నోరు తడారిపోతుంది. కళ్లలో ఇసుక పడినట్టు అనిపిస్తుంటుంది. ఎంత దుఃఖం వచ్చినా కళ్ల వెంట నీళ్లు రావు. సమస్య మరీ ఎక్కువైతే మహిళల్లో యోని పొడిబారుతుంటుంది కూడా. కొందరికి చర్మం మీద వాస్క్యులైటిస్‌ దద్దు రావొచ్చు. ప్లీహం పెద్దగా అయ్యి రక్తకణాలు, ప్లేట్‌లెట్లు తగ్గొచ్చు. ఊపిరితిత్తులు దెబ్బతిని ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరొచ్చు. మృదు కణజాలం స్థానంలో కొబ్బరి పీచులాంటి పదార్థం ఏర్పడొచ్చు. దీంతో దగ్గు, ఆయాసం వస్తాయి. గుండె ప్రభావితమైతే వేగంగా కొట్టుకోవచ్చు. గుండె కండరం మందం కావొచ్చు. కొందరిలో నాడులు దెబ్బతిని, స్పర్శ తగ్గిపోవచ్చు. మణికట్టు కీళ్లు వాస్తే లోపలి నాడులు నొక్కుకు పోతాయి. ఇది వేళ్లలో నొప్పి, తిమ్మిరి, బలహీనతకు (కార్పెల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌) దారితీయొచ్చు.

నిర్ధరణ: లక్షణాల తీరు, కొన్ని పరీక్షల ఆధారంగా రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ను నిర్ధరిస్తారు. దీని బారినపడ్డవారి రక్తంలో రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌ (ఆర్‌ఏ ఫ్యాక్టర్‌), సీసీపీ యాంటీబాడీ పాజిటివ్‌గా ఉంటాయి. ఈఎస్‌ఆర్‌, సీఆర్‌పీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్స్‌రే తీస్తే ఎముకలో మార్పులు కనిపిస్తాయి. తొలిదశలో ఎక్స్‌రేలో తేడాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. అప్పుడు అల్ట్రాసౌండ్‌ పరీక్ష ఉపయోగపడుతుంది. ఒకోసారి ఎంఆర్‌ఐ కూడా చేయాల్సి రావొచ్చు.

స్పాండైలో ఆర్థ్రయిటిస్‌
ఇది వెన్నెముక మీద దాడిచేసే ఆర్థ్రయిటిస్‌. కొందరిలో చేతులు, కాళ్లలోని కీళ్లు కూడా ప్రభావితం కావొచ్చు. చర్మం, పేగులు సైతం దెబ్బతినొచ్చు. అందుకే దీన్ని రకరకాల సమస్యలుగా విభజించి చూడాల్సి ఉంటుంది.

సొరియాటిక్‌ ఆర్థ్రయిటిస్‌
మామూలుగానైతే సొరియాసిస్‌ వచ్చాక కీళ్లవాతం మొదలవుతుంటుంది. కానీ మూడింట ఒక వంతు మందికి ఆర్థ్రయిటిస్‌ వచ్చాక సొరియాసిస్‌ మొదలవుతుంది. వీరిలో రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌ నెగెటివ్‌గా ఉండటం గమనార్హం. దీని లక్షణాలు రుమటాయిడ్‌ కీళ్లవాతం మాదిరిగానే ఉంటాయి. తేడా ఏంటంటే- కీళ్ల నొప్పులు, వాపుల వంటి లక్షణాలు అసమాన (ఎసిమ్మెట్రికల్‌) పద్ధతిలో కనిపిస్తుంటాయి. గోళ్లు అనారోగ్యంగా.. పెళుసుగా, మందంగా ఉండటం మరో ప్రత్యేకత. గోళ్లు తేలికగా విరిగిపోతుంటాయి. గోళ్ల మీద గుంతలూ పడతాయి. ఇలాంటి గోళ్ల లక్షణాలతో పాటు కీళ్లవాపులూ ఉన్నట్టయితే సొరియాటిక్‌ ఆర్థ్రయిటిస్‌గా భావించొచ్చు. మూడు కీళ్లూ వాచిపోవటం వల్ల వీరిలో వేళ్లు మిరపబజ్జీల్లానూ కనిపిస్తుంటాయి. అయితే నొప్పి తక్కువగా ఉండటం వల్ల చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆసుపత్రికి వచ్చేసరికే సమస్య తీవ్రమై ఉంటుంది.

నిర్ధరణ: దీన్ని లక్షణాలతోనే నిర్ధరిస్తారు. రక్త పరీక్షలో ఈఎస్‌ఆర్‌, సీఆర్‌పీ ఎక్కువగా ఉండొచ్చు. కొందరిలో యూరిక్‌ ఆమ్లం కాస్త ఎక్కువగా ఉండొచ్చు. ఎక్స్‌రేలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. అవసరమైతే అల్ట్రాసౌండ్‌, ఎంఆర్‌ఐ కూడా చేయాల్సి రావొచ్చు.

యాంకైలోజింగ్‌ స్పాండిలైటిస్‌
ఇది వెన్నెముకను గడకర్రలా మార్చే సమస్య. దీని బారినపడుతున్న ప్రతి పది మందిలో 9 మంది మగవారే ఉంటారు. నడుస్తున్న తీరును బట్టి దీన్ని చూడగానే గుర్తించొచ్చు. గూని ఉన్నవారిలా నడుస్తుంటారు. మెడను పక్కలకు తిప్పలేరు. శరీరం మొత్తాన్ని తిప్పి పక్కలకు చూస్తుంటారు. యాంకైలోజింగ్‌ స్పాండిలైటిస్‌ ముందు నడుంనొప్పితో మొదలవుతుంది. మూడు నెలలైనా నడుం నొప్పి విడవకుండా వేధిస్తుంటే దీన్ని అనుమానించాలి. ప్రత్యేకించి ఉదయం పూట నొప్పి ఉండటం, అదీ 45 నిమిషాల వరకైనా నొప్పి తగ్గకపోటం, అలాగే అర్ధరాత్రీ నొప్పి వస్తుంటే తాత్సారం చేయరాదు. పిరుదులపై నొప్పి కుడి ఎడమలకు మారిపోతుండటం మరో ప్రత్యేకత. పడుకున్నప్పుడు మంచం మీద పక్కలకు దొర్లటానికి ఇబ్బంది పడుతున్నా, అనుమానించాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే నెమ్మదిగా వెన్నుపూసలు బిగుసుకుపోవటం ఆరంభిస్తాయి. చివరికి వెన్నెముక గడకర్రలా తయారవుతుంది. ఇటుకల మధ్య సిమెంటు పెట్టినట్టుగా పూసలు బిగుసుకుపోతాయి. అందువల్ల ముందు నుంచే వ్యాయామం చేయాల్సి ఉంటుంది. కొందరిలో కీళ్లు కూడా.. ముఖ్యంగా పెద్దవి ప్రభావితమవుతాయి.

నిర్ధరణ: వీరి రక్తంలో హెచ్‌ఎల్‌ఏ బి27 పాజిటివ్‌గా ఉంటుంది. ఈఎస్‌ఆర్‌, సీఆర్‌పీ పెరుగుతుంది. ఎక్స్‌రేలో కటి ఎముకలో సాక్రమ్‌, ఇలియాక్‌ మధ్యలోని సాక్రో-ఇలియాక్‌ కీళ్లలోనూ మార్పులు కనిపిస్తాయి. వెన్నెముక ఎక్స్‌రేలో చిన్న చిన్న ముళ్ల వంటివి (సిండెస్మో ఫైట్స్‌) కనిపిస్తాయి.

రియాక్టివ్‌ ఆర్థ్రయిటిస్‌
మూత్ర ఇన్‌ఫెక్షన్లు, నీళ్ల విరేచనాలు, గొంతునొప్పి వంటి సమస్యలు వచ్చిన 1-4 వారాల తర్వాత తలెత్తే కీళ్లనొప్పులివి. కొన్ని కణజాలాలు బ్యాక్టీరియా నిర్మాణాన్ని పోలి ఉంటాయి. వీటి మధ్య తేడాను గుర్తించలేని యాంటీబాడీలు కీళ్ల మీద దాడిచేయొచ్చు. ముఖ్యంగా పెద్ద కీళ్లలో నొప్పి, వాపు ఉంటాయి. చికిత్సకు తేలికగా నయమైపోతుంది. కొన్నిసార్లు తనకు తానే తగ్గిపోవచ్చు.

ఎంటెరోపతిక్‌ ఆర్థ్రయిటిస్‌
పేగులకు, కీళ్లకు దగ్గరి సంబంధముంది. పెద్ద పేగులో వాపు (ఇన్‌ఫ్లమేషన్‌) మూలంగా తలెత్తే క్రోన్స్‌, అల్సరేటివ్‌ కొలైటిస్‌ గలవారిలో కొందరికి ఆర్థ్రయిటిస్‌ రావొచ్చు. అసలు జబ్బులు తగ్గితే ఇదీ తగ్గిపోతుంది.

వైరల్‌ రియాక్టివ్‌ ఆర్థ్రయిటిస్‌
కొన్ని వైరల్‌ జబ్బుల్లోనూ కీళ్లవాపులు రావొచ్చు. చికున్‌ గన్యాలో ఇలాంటి నొప్పులు తరచూ చూసేవే. డెంగీ, కొవిడ్‌లోనూ దీన్ని చూస్తుంటాం.

సమర్థ చికిత్స
Arthritis treatment in Telugu : కీళ్లవాతానికి సమర్థ చికిత్స ఉంది. నొప్పిని తగ్గించటంతో పాటు జబ్బును మార్చేసే మందులు బాగా ఉపయోగపడతాయి. వీటితో సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. చికిత్సతో జబ్బు తగ్గాక చక్కటి జీవితాన్ని గడపొచ్చు. పెళ్లి చేసుకోవచ్చు, లైంగిక జీవితాన్ని హాయిగా ఆస్వాదించొచ్చు. పిల్లల్ని కనొచ్చు.

నొప్పి నివారణ మందులు: ఇవి అన్ని కీళ్ల నొప్పులకు ఉపయోగపడతాయి. ప్రాథమిక దశలో ఐబూప్రొఫెన్‌, డైక్లోఫెనాక్‌, నెఫ్రోసిన్‌, ఎసిక్లోఫెనాక్‌ వంటి నాన్‌ స్టిరాయిడ్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు ఇస్తారు. కొందరికి తక్కువ ప్రభావం గల పారాసిటమాట్‌, ట్రెమడాల్‌ వంటివీ మేలు చేయొచ్చు.

స్టిరాయిడ్లు: నొప్పి తీవ్రత తగ్గటానికివి బాగా తోడ్పడతాయి. వీటిని అవసరాన్ని బట్టి మాత్రలు ఇంజెక్షన్ల రూపంలో ఇస్తుంటారు. వీటితో దీర్ఘకాలంలో దుష్ప్రభావాలుంటాయి కాబట్టి తక్కువ మోతాదులో తక్కువ కాలమే ఇస్తారు. మూడు నెలల తర్వాత ఆపేస్తారు. ఒకట్రెండు కీళ్లల్లోనే సమస్య ఉంటే కీళ్లలోకి కూడా స్టిరాయిడ్లు ఇంజెక్షన్లు ఇవ్వటం మేలు చేస్తుంది.

జబ్బు నియంత్రణ మందులు: వీటినే డిసీజ్‌ మోడిఫయింగ్‌ యాంటీ రుమాటిక్‌ డ్రగ్స్‌ అంటారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, మిథట్రక్సేట్‌, సల్ఫసలజైన్‌, లెఫ్లునమైడ్‌, సైక్లోఫాస్మమైడ్‌ వంటివి వీటి కోవలోకి వస్తాయి. ఇవి రోగనిరోధకశక్తి పనితీరును మార్చి, సక్రమంగా పని చేసేలా చూస్తాయి. ఆయా లక్షణాలు, తీవ్రతను బట్టి వీటిని ఇస్తారు.

బయోలాజికల్‌ మందులు: అటనార్‌సెప్ట్‌, ఇన్‌ఫెక్లిమాబ్‌, గొలిముమాబ్‌, అడలిముమాబ్‌, టొసిలిజుమాబ్‌, అబటాసెప్ట్‌, స్కాఫో, రిటుక్సిమాబ్‌ వంటివి వీటి కోవకు చెందుతాయి. ఇవి సమస్య నుంచి సత్వరం ఉపశమనం కలిగిస్తాయి. కాకపోతే ఖర్చు ఎక్కువ.

నిబ్స్‌: ఇప్పుడు నిబ్స్‌ అనే కొత్తరకం మందులు (టోఫాసిటెనిబ్‌, బారిసిటెనిబ్‌ వంటివి) కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి చాలా మంచి ఫలితం కనబరుస్తున్నాయి. సత్వరం ప్రభావం చూపుతాయి. బయోలాజికల్‌ మందుల కన్నా చవక.వ్యాయామం కీలకం
కీళ్లనొప్పులుంటే విశ్రాంతి తీసుకోవాలని చాలామంది భావిస్తుంటారు. నిజానికి వ్యాయామం చాలా ముఖ్యం. భోజనం మానేసినా తప్పులేదు గానీ వ్యాయామం మాత్రం మానరాదు. నడక, యోగాసనాలు, ఈత, ఏరోబిక్స్‌ వంటివి మేలు చేస్తాయి. అయితే శక్తికి మించిన బరువులు ఎత్తరాదు.

కౌన్సెలింగ్‌ అవసరం
కీళ్లవాతం దీర్ఘకాలిక సమస్య. దీని బారినపడ్డవారు నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. అందువల్ల కౌన్సెలింగ్‌తో భరోసా కల్పించటం అత్యవసరం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.