చాలామందికి శరీరంపై తెల్లమచ్చలు వస్తుంటాయి. చిన్నపిల్లలతో పాటు వయసుతో సంబంధం లేకుండా ఇవి ముఖం, చేతులపై ఏర్పడుతుంటాయి.
అయితే.. తెల్లమచ్చలు రావడానికి రెండు కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఒకటి హైపో పిగ్మెంట్ ప్యాచెస్, రెండోది డీ పిగ్మెంటెడ్ ప్యాచెస్. హైపో పిగ్మెంట్ ప్యాచెస్ అంటే మన శరీరం రంగు కన్నా తక్కువ రంగులో మచ్చలు ఏర్పడతాయి.
ఆ ప్రాంతంలో మెలెనోసైట్ తగ్గడం వల్ల ఈ మచ్చలు వస్తుంటాయి. మెలెనోసైట్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో డీ పిగ్మెంటెడ్ ప్యాచెస్ వస్తుంటాయి. సన్లైట్ లేదా యూవీ లైట్ అలర్జీలు ఉంటే కూడా మచ్చలు వస్తుంటాయి. ఒక్కోసారి పోషకాహార లోపం వల్ల కూడా తెల్లమచ్చలు ఏర్పడుతుంటాయని నిపుణులు చెబుతున్నారు.
అలా శరీరంపై తెల్లమచ్చలు వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా చర్మవైద్యుడి దగ్గరకు వెళ్లి.. చికిత్స తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: సంతాన సమస్యలా? ఈ రసం తాగి చూడండి!