ETV Bharat / sukhibhava

breakthrough infection : టీకా తీసుకున్నా.. కరోనా వ్యాప్తి... కారణమేంటి? - what is Breakthrough Infection

మొదట్నుంచీ కొవిడ్‌-19 కొత్త పోకడలే పోతోంది. రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటూ రోగ నిరోధకవ్యవస్థనూ బురిడీ కొట్టిస్తోంది. టీకాలు పూర్తిగా తీసుకున్న తర్వాతా కొందరిలో జబ్బును తెచ్చి పెడుతోంది. సత్వరం టీకాలు అందుబాటులోకి వచ్చాయని, ఇక కరోనా కథ అంతమైనట్టేనని సంతోషిస్తున్న తరుణంలో ఇలా కొత్త కలకలం(breakthrough infection) సృష్టిస్తోంది. ఎందుకిలా? దీనికి కారణాలేంటి? నివారణ మార్గాలేంటి?

టీకా తీసుకున్నా.. కరోనా వ్యాప్తి
టీకా తీసుకున్నా.. కరోనా వ్యాప్తి
author img

By

Published : Sep 14, 2021, 9:13 AM IST

టీకాలు తీసుకుంటే ఇన్‌ఫెక్షన్లను నివారించుకోవచ్చన్నదే మనందరి భావన. ఇందులో నిజం లేకపోలేదు. అలాగని పూర్తిగా వాస్తవమూ కాదు. ఏ టీకా అయినా నూటికి నూరు శాతం రక్షణ ఇవ్వలేదు. టీకా 50% ఇన్‌ఫెక్షన్‌ను నివారించినా ప్రపంచ ఆరోగ్యసంస్థ వాడకానికి అనుమతి ఇస్తుంది. ఆ మాటకొస్తే కొవిడ్‌-19 టీకాలు ఇంతకన్నా ఎక్కువ సమర్థంగానే పనిచేస్తున్నాయి. జబ్బు నివారణకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అయినా కూడా కొందరు టీకాలు తీసుకున్న తర్వాత కూడా కొవిడ్‌-19 బారినపడటం చూస్తున్నాం. వీటినే ‘బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లు(breakthrough infection)’ అంటారు. అంటే టీకాల ప్రభావాన్ని అధిగమించే జబ్బులని. నిజానికివి మామూలే. కొత్తేమీ కాదు. గతంలోనూ ఉన్నవే. కాకపోతే కరోనా జబ్బు విజృంభణ నేపథ్యంలో అందరికీ విచిత్రంగా కనిపిస్తోంది. వైరస్‌లో మార్పులు జరుగుతున్నంత కాలం, వాతావరణంలో వైరస్‌ తిరుగాడుతున్నంత కాలం మనం దీన్ని ఎదుర్కోవాల్సిందే. దీనిపై అవగాహన పెంచుకొని మసలుకోవాల్సిందే.

బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌ అంటే?

కరోనా టీకా రెండో మోతాదు తీసుకున్నాక 14 రోజుల తర్వాత ఆర్‌టీపీసీఆర్‌ లేదా యాంటిజెన్‌ పాజిటివ్‌గా తేలితే బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌(breakthrough infection)గా భావిస్తారు. రోజుకు ప్రతి 5వేల మందిలో ఒకరికి ఇలాంటి ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశముంది. కొవిడ్‌-19 విజృంభణ బాగా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరింత ఎక్కువమందికి రావొచ్చు.

కారణాలేంటి?

1. టీకాను సరైన ఉష్ణోగ్రతలో ఉంచకపోవటం. కొవిడ్‌-19 టీకా చాలా సున్నితమైంది. దీన్ని తగు ఉష్ణోగ్రతలో నిల్వ చేయటం ముఖ్యం. భద్రపరచినప్పుడు గానీ పంపిణీ చేసినప్పుడు గానీ తగు ఉష్ణోగ్రతలో ఉంచకపోతే టీకా సామర్థ్యం తగ్గిపోతుంది. దీంతో వైరస్‌ను ఎదుర్కొనే శక్తి సన్నగిల్లుతుంది.

2. సరైన మోతాదులో ఇవ్వకపోవటం. ఉదాహరణకు 0.5 ఎంఎల్‌కు బదులు 0.4 ఎంఎల్‌ ఇచ్చారనుకోండి. టీకా ప్రభావం తగ్గుతుంది.

3. రోగ నిరోధక వ్యవస్థ సరిగా ప్రతిస్పందించకపోవటం. కొందరికి టీకా తీసుకున్నప్పటికీ ఒంట్లో తగినన్ని యాంటీబాడీలు పుట్టుకు రాకపోవచ్చు. కొందరిలో యాంటీబాడీలు అసలే ఉత్పత్తి కాకపోవటం చూస్తున్నాం. ఇలాంటివారు కొద్దిపాటి వైరస్‌ ప్రభావానికి గురైనా ఇన్‌ఫెక్షన్‌ తలెత్తొచ్చు.

4. వాతావరణంలో వైరస్‌ పెద్ద మొత్తంలో తిరుగాడుతుండటం. తేలికపాటి వర్షం పడినప్పుడు రెయిన్‌ కోట్‌ తడవకుండా కాపాడుతుంది. అదే భారీ వర్షమైతే? ఉపయోగముండదు కదా. టీకా కూడా అలాంటిదే. వాతావరణంలో వైరస్‌ పెద్దమొత్తంలో తిరుగాడుతున్నప్పుడు టీకా తీసుకున్నవారికీ వైరస్‌ సోకే అవకాశముంది. మరి వాతావరణంలో ఎందుకు వైరస్‌ ఎక్కువగా ఉంటోంది? ఒకవైపు టీకా తీసుకోనివారు.. మరోవైపు ఒక టీకా తీసుకున్నవారు, రెండు టీకాలు తీసుకున్నవారు.. అంతా మునుపటి మాదిరిగానే కలిసి తిరుగుతున్నారు. చాలామంది మాస్కులను పెద్దగా పట్టించుకోవటం లేదు. వైరస్‌ సోకినా ఎంతోమందికి లక్షణాలు ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా తేలికపాటి తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇవన్నీ వాతావరణంలోకి వైరస్‌ ఎక్కువగా చేరుకునేలా చేస్తున్నాయి. ఇది టీకా తీసుకున్నా వైరస్‌ సోకటానికి దారితీస్తోంది. దీనికి కారణం టీకాలు పనిచేయకపోవటం కాదు. వైరస్‌ ప్రభావానికి ఎక్కువగా గురికావటమే.

5. వైరస్‌లో మార్పులు. కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ-2 శరవేగంగా మారుతోంది. ఇప్పుడు చాలా త్వరగా వ్యాపించే డెల్టా రకం వైరస్‌ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. మొదట్లో టీకా తీసుకున్నవారు మాస్కు లేకుండా బయటకు రావొచ్చని అమెరికాలో ప్రకటించారు. కానీ డెల్టా రకం వైరస్‌ రాకతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. డెల్టా కేసులు పెరుగుతున్నకొద్దీ బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లూ ఎక్కువవుతున్నాయి. టీకా అనంతర ఇన్‌ఫెక్షన్లలో 95% కేసులకు డెల్టా రకం వైరసే కారణమవుతోంది. ప్రస్తుతం ఇస్తున్న టీకాలన్నీ మొదట్లో వచ్చిన వైరస్‌ జన్యు పదార్థంతో రూపొందించినవే. ఇవి డెల్టా రకం వైరస్‌ను పూర్తిగా అడ్డుకోలేకపోవచ్చు. టీకాతో పుట్టుకొచ్చిన యాంటీబాడీల దృష్టికి చిక్కకుండా వైరస్‌ ఒంట్లోకి ప్రవేశించొచ్చు. ఇది బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంది.

బ్రేక్‌త్రూనా? టీకా దుష్ప్రభావాలా?

టీకా తీసుకున్నాక కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే కొందరు టీకా దుష్ప్రభావాలుగానూ భావిస్తుంటారు. టీకా దుష్ప్రభావాల్లో ఆర్‌టీపీసీఆర్‌ పాజిటివ్‌గా ఉండదు. అందువల్ల టీకాలు తీసుకున్న 14 రోజుల తర్వాత నిర్ధారణ పరీక్ష పాజిటివ్‌గా తేలితే బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌(breakthrough infection)గానే భావించాల్సి ఉంటుంది. మరో ముఖ్యమైన సంగతి- టీకా దుష్ప్రభావాలు 2-3 రోజుల్లోనే కనిపిస్తాయి. అదే కొవిడ్‌ లక్షణాలు ఎప్పుడైనా మొదలవ్వచ్చు. క్రమంగా ఎక్కువవుతూ రావొచ్చు.

రెండో మోతాదు టీకా తీసుకునే సమయానికే కొందరు కొవిడ్‌ బారినపడి ఉండొచ్చు. జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే టీకా దుష్ప్రభావాలుగా పొరపడే అవకాశం లేకపోలేదు. ఒకవేళ లక్షణాలు రెండు మూడు రోజుల్లో తగ్గకుండా, క్రమంగా తీవ్రమవుతూ వస్తుంటే వెంటనే నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి.

జన్యు విశ్లేషణ తప్పనిసరి

బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డవారి నుంచి వైరస్‌ను సేకరించి జన్యు విశ్లేషణ చేయటం తప్పనిసరి. దీంతో అది గతంలో సోకిన వైరసా? కొత్త వైరసా? అనేది బయటపడుతుంది. టీకా పనిచేస్తోందా? లేదా? పనిచేస్తే ఎంతవరకు పనిచేస్తుంది? అనేవీ తెలుస్తాయి.

వైరస్‌ మార్పులకు అనుగుణంగా టీకాను పునరుద్ధరించే ప్రక్రియ నిరంతరం సాగాల్సి ఉంది. ఫ్లూ టీకాను ప్రతి సంవత్సరం మారుస్తుండటం తెలిసిందే. సార్స్‌-కొవీ-2 కొత్త వైరస్‌ కావటం, చాలా వేగంగా మారుతూ వస్తుండటంతో టీకాలతో పుట్టుకొచ్చే యాంటీబాడీలు ఆర్నెల్ల వరకే ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల అనుక్షణం వైరస్‌ మార్పులను పసిగట్టడం, వీటికి అనుగుణంగా టీకాలను మార్చటం ద్వారా బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లను అరికట్టొచ్చు.

ఎవరికి ముప్పు ఎక్కువ?

బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్ల(breakthrough infection) ముప్పు వృద్ధులకు ఎక్కువ. ఊబకాయం.. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల జబ్బుల వంటి దీర్ఘకాల సమస్యలు గలవారికి ముప్పు మరింత అధికం. సరైన వసతులు లేని వృద్ధాశ్రమాల్లో నివసించేవారికి, తరచూ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం గలవారికీ ప్రమాదం పొంచి ఉంటుంది. బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లతో ఆసుపత్రిలో చేరిన, మరణించినవారిలో మూడొంతుల మంది 65 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు గలవారే. ఇతరత్రా జబ్బులు కూడా తోడవటం వీరికి ఇంకాస్త తీవ్రంగా పరిణమిస్తోంది. అందువల్ల టీకాలు పూర్తిగా తీసుకున్నా వృద్దుల్లో కొవిడ్‌ అనుమానిత లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం పనికిరాదు. వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించాలి.

లక్షణాలు అవేనా?

టీకాలు తీసుకున్నవారిలో ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు భిన్నంగా ఉండొచ్చు. బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌(breakthrough infection)లో ప్రధానంగా తలనొప్పి, ముక్కు కారటం, తుమ్ములు, గొంతు నొప్పి, వాసన పోవటం కనిపిస్తుంటాయి. అదే టీకాలు తీసుకోనివారిలో తలనొప్పి, గొంతు నొప్పి, ముక్కు కారటంతో పాటు జ్వరం, విడవకుండా దగ్గు వేధిస్తుంటాయి.

మరి టీకాలతో ఉపయోగమేంటి?

టీకాలు తీసుకున్నా ఇన్‌ఫెక్షన్‌ వచ్చేట్టయితే మరేంటి ప్రయోజనమన్నది చాలామంది సందేహం. నిజానికి టీకా ఉద్దేశం వైరస్‌ వ్యాప్తి నివారణ ఒక్కటే కాదు. జబ్బు తీవ్రం కాకుండా చూడటం కూడా. ఒకరకంగా టీకాను హెల్మెట్‌తో పోల్చుకోవచ్చు. హెల్మెట్‌ పెట్టుకునే ప్రమాదం అసలే జరగదని కాదు. ప్రమాదం జరిగితే తీవ్రత తగ్గుతుంది. కొవిడ్‌-19 టీకాలూ ఇలాంటివే. వీటిని తీసుకున్నవారు ఒకవేళ ఇన్‌ఫెక్షన్‌ బారినపడినా జబ్బు తీవ్రం (తొలివారంలో ఐదు, అంతకన్నా ఎక్కువ లక్షణాలు ఉండటం) కావటం లేదు. చాలామంది త్వరగా, తేలికగానే బయటపడగలుగుతున్నారు. ఒక శాతం కన్నా తక్కువ మందే (సుమారు 0.004%) ఆసుపత్రిలో చేరుతున్నారు. అత్యవసర చికిత్స అవసరమూ తప్పుతోంది. మరణాలు తగ్గుతున్నాయి. టీకాలు తీసుకోనివారితో పోలిస్తే పూర్తిగా టీకాలు తీసుకున్నవారు కొవిడ్‌-19తో మరణించే ముప్పు 11 రెట్లు తక్కువని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మనకన్నా ముందు టీకా కార్యక్రమం మొదలైన అమెరికా అనుభవాలను పరిశీలిస్తే- పూర్తి టీకాలు తీసుకున్న 17.67 కోట్ల మందిలో 12,908 మంది బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌ బారినపడగా.. వీరిలో 2,437 మంది మరణించారు. జబ్బు తీవ్రం కాకుండా, మరణం సంభవించకుండా చూడటంలో టీకాలు 60-95% సమర్థంగా పనిచేస్తున్నట్టు అనుభవాలు చెబుతున్నాయి. అంటే టీకాలు తీసుకోనివారితో పోలిస్తే తీసుకున్నవారిలో జబ్బు తీవ్రత, మరణాలు 60% నుంచి 95% తక్కువనే అర్థం. కాబట్టి టీకాలను తక్కువ చేసి చూడటం తగదు. తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.

కొవిడ్‌-19 బారినపడ్డ కొందరిలో సుదీర్ఘంగా.. 28 రోజులు అంతకన్నా ఎక్కువ కాలం దగ్గు వంటివి వేధిస్తున్నాయి (లాంగ్‌ కొవిడ్‌). రెండు మోతాదుల టీకాలు తీసుకున్నవారికి దీని ముప్పు సగానికి పైగా తగ్గుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

నివారణ ఎలా?

టీకా అనగానే ఇన్‌ఫెక్షన్‌ నివారణే మనసులో మెదలుతుంది. కొవిడ్‌-19, ఫ్లూ టీకాల విషయంలో దీన్ని మార్చుకోవాల్సిన అవసరముంది. ఎందుకంటే వైరస్‌ వాతావరణంలో ఇంకా తిరుగాడుతూనే ఉంది. వైరస్‌ ఎప్పటికప్పుడు మారిపోతోంది కూడా . ఇలాంటి పరిస్థితుల్లో టీకాలు ఇన్‌ఫెక్షన్‌ను పూర్తిగా నివారించలేవు. మరెలా? నూటికి నూరు శాతం మంది టీకాలు తీసుకోవటం ద్వారా నివారించుకోవచ్చు గానీ అదిప్పుడప్పుడే సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. కాబట్టి కొవిడ్‌-19 నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలను టీకాలు తీసుకున్న తర్వాతా కొనసాగించటం ముఖ్యం. శత్రువు మీద విజయం సాధించేంతవరకు ఆయుధాలు ధరించాల్సిందే. కొవిడ్‌-19ను ఎదుర్కోవటానికి మనదగ్గరున్న పెద్ద ఆయుధాలు మాస్కు పెట్టుకోవటం, ఇతరులకు దూరంగా ఉండటం, తరచూ చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవటం.

మొదట్లో టీకా తీసుకున్నవారి నుంచి ఇతరులకు వైరస్‌ సోకదనే భావించారు. కానీ డెల్టా రకం వైరస్‌తో పరిస్థితి మారిపోయింది. ఇది టీకా తీసుకున్నవారిలోనూ, తీసుకోనివారిలోనూ ఒకే స్థాయిలో ఉంటుండటం గమనార్హం. అంటే టీకా తీసుకున్నవారి నుంచీ ఇతరులకు వైరస్‌ అంటుకునే ప్రమాదముందనే అర్థం. టీకాలు తీసుకున్నవారికి జబ్బు తీవ్రత తక్కువ కాబట్టి కొందరిలో ఎలాంటి లక్షణాలు లేకపోవచ్చు. ఉన్నా తేలికపాటి లక్షణాలకే పరిమితం కావొచ్చు. ఒక టీకా తీసుకున్నాక ఇన్‌ఫెక్షన్‌ వచ్చినవారిలో 63% మంది, రెండు టీకాలు తీసుకున్నాక ఇన్‌ఫెక్షన్‌ వచ్చినవారిలో 94% మంది ఎలాంటి లక్షణాలు లేనివారే. కానీ వీరి నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాపించే అవకాశం లేకపోలేదు. వీరి నుంచి కొత్తగా వైరస్‌ సోకినవారికి ఇన్‌ఫెక్షన్‌ ఉద్ధృతంగానూ పరిణమించొచ్చు. కాబట్టి మాస్కు ధరించటం చాలా చాలా ముఖ్యం. అలాగే ఇతరులకు దూరంగా ఉండటం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం ద్వారా ఇన్‌ఫెక్షన్లను నివారించుకోవచ్చు.

బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌(breakthrough infection) లక్షణాలు కనిపిస్తే తొలి రోజు నుంచే 10 రోజుల పాటు ఇతరులతో కలవకుండా విడిగా ఉండాలి. జ్వరం, ఇతర లక్షణాలు తగ్గిన తర్వాత 24 గంటల వరకూ అలాగే ఉండాలి. ఒకవేళ కరోనా నిర్ధారణ పరీక్ష పాజిటివ్‌గా వచ్చి, లక్షణాలేవీ లేకపోతే 10 రోజుల వరకు విడిగా ఉండాలి. దీంతో ఇతరులకు వైరస్‌ సోకకుండా చూసుకోవచ్చు.

బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్ల(breakthrough infection) నివారణకు బూస్టర్‌ టీకా ఎంతగానో ఉపయోగపడుతుంది. విదేశాల్లో ఇప్పటికే దీన్ని ఆరంభించారు. ముందుగా వృద్ధులకు, దీర్ఘకాలిక జబ్బులు గలవారికి బూస్టర్‌ టీకా ఇస్తున్నారు. మనదగ్గర కూడా.. ప్రధానంగా కొవిడ్‌-19 ముప్పు అధికంగా ఉన్న వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులు గలవారికి దీన్ని ఇవ్వాల్సిన అవసరముంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.