ETV Bharat / sukhibhava

విపరీతమైన తలనొప్పి.. మైగ్రేనా లేక కరోనానా? - etv bharat health

కొవిడ్ మహమ్మారి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యాధులను గుర్తించడాన్ని కరోనా వైరస్ మరింత సంక్లిష్టం చేసింది. ఇదివరకు తరచూ విపరీతమైన తలనొప్పి వస్తుంటే.. మైగ్రేన్ అని గుర్తించి వైద్యులను సంప్రదించేవారు. కానీ, ఇప్పుడు ఈ విపరీతమైన తలనొప్పి కరోనా లక్షణాల్లో ఒకటి. మరి, ఆ నొప్పి కరోనాతో వస్తోందా, మైగ్రేన్ వల్ల వస్తోందా.. తెలుసుకోవడం ఎలా?

what-are-the-difference-symptos-of-between-corona-and-migraine
విపరీతమైన తలనొప్పి... మైగ్రేన్ వల్ల? కరోనా వల్ల?
author img

By

Published : Sep 10, 2020, 12:03 PM IST

Updated : Sep 10, 2020, 12:28 PM IST

మైగ్రేన్ వల్ల వచ్చే తలనొప్పి, కొవిడ్ సోకినప్పుడు వచ్చే తలనొప్పికి తేడా ఏంటి? ఈ రెండు వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి? ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఓ సారి చూసేయండి...

మైగ్రేన్ అంటే....?

మైగ్రేన్ అనేది నరాలకు సంబంధించిన దీర్ఘకాలిక రుగ్మత. ఇది వ్యక్తులను అంగవైకల్యానికి గురిచేసే వ్యాధులలో 6వ స్థానంలో ఉంది. ఇది అతి సాధారణంగా కనిపించే వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ఒక సంవత్సర కాలంగా ఈ వ్యాధితో బాధపడే వారు 14.7 శాతం ఉంటారని ఒక అంచనా.

భారత్​లో ప్రతి నలుగురిలో ఒకరు ఏదో ఒక రకంగా ఈ వ్యాధితో భాదపడుతున్నారు. ఇక వీరిలో 25 శాతం మంది రోగులు తరచూ వైద్యులను సంప్రదించాల్సిన పరిస్థితి. అందులో 2 నుంచి 4 శాతం అత్యవసర విభాగాలలో చికిత్స తీసుకోవాల్సి వస్తోందని లెక్కలు చెబుతున్నాయి. ఇక తలనొప్పితో ఆసుపత్రులకు వచ్చే వారిలో 35 శాతం మంది మైగ్రేన్​తో ఇబ్బందులుపడుతున్న వారేనని నిపుణులు చెబుతున్నారు.

కరోనా వేళ.. చికిత్స ఎలా?

తరచూ ఆసుపత్రికి వెళ్లాల్సిన మైగ్రేన్ పేషెంట్లు టెలిమెడిసన్ ద్వారా చికిత్స పొందొచ్చు. ఇందుకోసం మైగ్రేన్ బాధితులను మూడు రకాలుగా వర్గీకరించాలి.

మొదటి రకంలో తరచూ తలనొప్పి రాని వారిని చేరిస్తే.. వీరికి టెలిమెడిసన్ ద్వారానే చికిత్స పూర్తిగా అందించవచ్చు.

ఇక రెండవ రకంలో నెలకు 14 రోజుల వరకూ తలనొప్పితో బాధపడే వారిని చేర్చాలి.

నెలలో సగం కంటే ఎక్కువ రోజులు తలనొప్పితో భాదపడే వారిని మూడో రకంగా పరిగణించాలి.

ఈ రెండు గ్రూపులను తరచూ వైద్యులు టెలిమెడిసన్ ద్వారా సంప్రదిస్తూ వారికి అవసరమైన చికిత్సను అందించవచ్చు. టెలిమెడిసన్ ద్వారానే కాకుండా, ఇప్పుడు అందుబాటులో ఉన్న వీడియో కౌన్సలింగ్ ద్వారా వారి తాజా శారీరక, మానసిక పరిస్థితిని వైద్యులు గమనించవచ్చు. అలా వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే అవసరాన్ని తగ్గించవచ్చు.

వేరే తలనొప్పి అయితే..?

తలనొప్పులను అర్థం చేసుకోవడానికి రోగి ఆరోగ్య చరిత్ర అవగాహన చేసుకొని.. అవసరమైతే చిన్న చిన్న పరీక్షలు నిర్వహించడం ద్వారా దీని వెనుక ఉన్న సరైన కారణం గుర్తించవచ్చు. ఈ విషయంలోనూ టెలిమెడిసన్ లేదా వీడియో కౌన్సిలింగ్ బాగా ఉపయోగపడుతుంది.

చికిత్స ఎప్పుడు అవసరం..?

తీవ్రమైన తలనొప్పి రావడం వెంటనే తగ్గిపోవడం, జీవితంలో మొదటి సారి భరించలేని స్థాయిలో తలనొప్పి, తరచుగా వచ్చే తలనొప్పికి భిన్నంగా ఉండడం, మనిషి శరీరాకృతిలో మార్పులు వచ్చేలా లక్షణాలు ఉండడం, దగ్గు, అలసిపోవడం, ఉదయాన్నే తీవ్రమైన తలనొప్పి రావడం అంటే నిద్రలేవగానే నొప్పి అనిపించడం, తలనొప్పితో పాటూ జ్వరం రావడం, బరువు తగ్గడం, మెడ నొప్పి, గందరగోళం, సరైన రీతిలో దృష్టి నిలపలేకపోవడం సహా 50 ఏళ్ల తర్వాత వచ్చే తలనొప్పులు ఏర్పడితే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స పొందాలి.

కొవిడ్ లక్షణాలతో...

కొవిడ్ ఇన్ఫెక్షన్​తో బాధపడే వారిలో ఏర్పడే లక్షణాలలో తలనొప్పి కూడా ఒకటి. అయితే ఇది కేవలం 8 శాతం బాధితుల్లో మాత్రమే కనిపిస్తోన్న లక్షణం. ఇక కొవిడ్ పేషెంట్లలో కనిపించే కడుపు నొప్పి, వాంతులు వంటి కడుపు సంబంధిత ఇబ్బందులు కూడా మైగ్రేన్ వ్యాధిగ్రస్తులలోనూ ఉంటాయి. అందుకే కొత్తగా తలనొప్పి మొదలైనా లేదా తరచూ వచ్చే తలనొప్పి లక్షణాలు తీవ్రంగా మారితే అందుకు కొవిడ్ కారణం కావచ్చని అనుమానించాలి.

తలనొప్పితో పాటు జ్వరం, పొడి దగ్గు, అలసట, మల విసర్జన పద్ధతి, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, కండరాలు లేదా జాయింట్​లలో నొప్పులు, గొంతు నొప్పి, చలి, కడుపులో ఇబ్బందితో పాటూ వాంతులు, ముక్కు పూడిపోవడం, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తేనే అది కొవిడ్ ఇన్ఫెక్షన్ అని భావించాలి.

మైగ్రేన్​కు కరోనా కారణమా?

లాక్​డౌన్​ తర్వాత ప్రస్తుత కొవిడ్ మహమ్మారి కారణంగా ఒత్తిడి, తలనొప్పి సమస్యలు పెరుగుతున్నాయనే చెప్పవచ్చు. లాక్​డౌన్​ కారణంగా మానసిక, శారీరక, ఆర్థిక ఒత్తిడిలు, ఉద్వేగాలు పెరుగుతున్నాయి. జీతాలు తగ్గడం వంటి వాటితో పాటు చిన్నారులు, పెద్దలు ఇంటి వద్దనే చదువు, వర్క్​ ఫ్రమ్​ ఆఫీసు పేరుతో కంప్యూటర్​లు లేదా డిజిటల్ స్క్రీన్స్ ముందు కూర్చోవడం కూడా పెరుగుతున్న తలనొప్పులకు కారణమని చెప్పవచ్చు. దీంతో మైగ్రేన్​తో బాధపడుతున్న వారిలో తరచుగా తలనొప్పి వస్తోంది. కుంగుబాటు, ఆందోళనల కారణంగా కూడా ఈ మైగ్రేన్ వ్యాధి పెరుగుతోంది.

జీవన శైలి మార్పు..

మైగ్రేన్ బారిన పడకుండా ఒత్తిడిని తగ్గించుకోవాలి. నిత్యం ఇంట్లోనే కూర్చోకుండా, అప్పుడప్పుడూ వ్యాయామాలు చేస్తూ ఉండాలి. డిజిటల్ స్క్రీన్​లపై గడిపే సమయాన్ని తగ్గించాలి. అందులోనూ ముఖ్యంగా రాత్రి 10 గంటల తర్వాత ఫోన్ల వినియోగం తగ్గించాలి. వైద్యుల సలహాలు, సూచనల మేరకు మందులు తీసుకోవడం ద్వారా ఈ ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు.

పైన పేర్కొన్న విధంగా సలహాలు పాటిస్తూ మైగ్రేన్, కొవిడ్​ల మధ్య ఉన్న తేడాలను అవగాహన చేసుకోవడం ద్వారా ఈ వ్యాధితో భాదపడుతున్న వారు తమ ఇబ్బందులను, అపోహలను దూరం చేసుకోవచ్చు. సరైన చికిత్స తీసుకోవడం ద్వారా మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రస్థుత పరిస్థితులలో ఇదే సరైన మార్గం.

what-are-the-difference-symptos-of-between-corona-and-migraine
డాక్టర్, సింధూ వాసిరెడ్డి, న్యూరలజిస్ట్

-డాక్టర్. సింధూ వాసిరెడ్డి, న్యూరాలజిస్ట్, హైదరాబాద్

ఇదీ చదవండి: కాబోయే అమ్మలూ.. మీకోసమే ఈ ముందు జాగ్రత్తలు!

Last Updated : Sep 10, 2020, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.