ETV Bharat / sukhibhava

బరువు తగ్గడానికి ఆయుర్వేద చిట్కాలు - ఆయుర్వేదంతో అతిబరువు తగ్గించవచ్చు

ayurveda weight loss tips: అధిక బరువును తగ్గించడానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు. వ్యాయామం చేస్తారు. తిండి తగ్గిస్తారు. అయినా బరువు తగ్గడం అసాధ్యంగా మారుతుంది. కానీ ఆయుర్వేద చిట్కాలతో అధిక బరువును తగ్గించుకోవచ్చు అవేంటో చూద్దాం..

weight loss tips in ayurveda
అతి బరువు
author img

By

Published : Dec 10, 2021, 7:00 AM IST

Updated : Dec 10, 2021, 8:30 PM IST

weight loss tips in ayurveda: బరువును తగ్గించుకోవడానికి మనలో చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. డైటింగ్​లు, ఉపవాసాలు, ఆహారంలో మార్పులు, యోగాసనాలు ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా బరువు తగ్గడం అసాధ్యంగా మారుతుంది. కష్టపడి కేజీ బరువు తగ్గితే.. మరికొన్ని రోజులకే అంతకుమించి బరువు పెరుగుతారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గనివారికి ఆయుర్వేదంలో పరిష్కారం ఉందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

ఈ క్రింది నియమాలు పాటించాలి..

  • పిజ్జా, బర్గర్లు, కూల్​ డ్రింగ్స్, బేకరీ ఫుడ్స్​ తగ్గించి.. ఆకుకూరలతో కూడిన ఆరోగ్య ఆహారం మితంగా తీసుకోవాలి.
  • ఉపవాసాలు చేయకూడదు. ఒక్కసారిగా శరీరానికి పిండిపదార్థాలు అందకుండా అయిపోతాయి.
  • ప్రతిరోజూ వ్యాయామం తప్పక చేయాలి
  • రోజూ ఉదయాన్నే తేనె నిమ్మరసం కలిపి తాగాలి.
  • పళ్లు, పళ్లరసాన్ని నిత్యం తీసుకుంటుండాలి. క్యాబేజీని సలాడ్​ రూపంలో తాగితే బరువును తగ్గించుకోవచ్చు.
  • దాల్చిన చెక్క, ఆవాలు, మిరియాలు, జీలకర్ర వంటి దినుసులకు కొవ్వులను కరిగించే గుణం ఉంటుంది. రోజూవారి వంటలో వీటిని భాగం చేయాలి.
  • వెల్లుల్లిలోని ఉండే రసాయనానికి బరువును తగ్గించే గుణం ఉంది. రోజూ కూరలో వెల్లుల్లిని తప్పక తీసుకోవాలి.
  • పచ్చి మిర్చిలో క్యాప్సిన్ అనే రసాయనానికి ఒంట్లో క్యాలరీలను కరిగించే గుణం ఉంది. పచ్చిమిర్చితో శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. దీంతో క్రమంగా బరువు తగ్గే అవకాశం ఉంది.
  • త్రిఫలాలు ఉసిరి, తానికాయ, కరక్కాయను సమానంగా తీసుకుని త్రికటుకాలు మిరియాలు, సొంటి, పిప్పళ్లు వీటితో పాటు చిత్రకుమా అనే ఔషధాన్ని సమానంగా కలిపి చూర్ణంగా చేసి రోజూ రెండు సార్లు సగం చెంచాను భోజనానికి ముందు తీసుకోవాలి. తేనెతో కలిపి అనుపానంగా తీసుకుంటే ఇంకా మేలుగా ఉంటుంది.
  • ఇప్ప టెట్టు జిగురును గోరువెచ్చని నీళ్లతో కలిపి తీసుకోవాలి.

ఇంకా మరిన్ని చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:తినాలనే కోరిక తగ్గాలంటే.. ఇలా చేయండి

Last Updated : Dec 10, 2021, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.