Walking Benefits : మార్నింగ్ వాక్ వల్ల అనేక శారీరక, మానసిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉదయపు నడక మీలో ఆత్మవిశ్వాసాన్ని కూడా నింపుతుంది. రోజును యాక్టివ్‌గా ప్రారంభించేందుకు మార్నింగ్ వాక్ ఓ గొప్ప ఆయుధం. ఉదయపు నడక వల్ల కలిగే మరికొన్ని ఆరోగ్య లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.
శారీరక ఆరోగ్యం..
శారీరకంగా మరింత దృఢంగా ఉండేందుకు ఉదయపు నడక ఎంతో దోహదం చేస్తుంది. ఇది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది బరువును బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు, షుగర్, ఊబకాయం లాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.
ఎనర్జీ లెవెల్స్‌ను పెంచుతుంది..
ఉదయాన్నే చేసే నడక మీ శరీరంలోని ఎనర్జీ లెవెల్స్‌ను పెంచుతుంది. అంతేకాకుండా మీరు రోజంతా అప్రమత్తంగా ఉంటూ మీరు చేసే పనులపై ఫోకస్ పెట్టేలా చేస్తుంది. అలాగే మీ జీవక్రియలను మార్నింగ్ వాక్ మెరుగుపరుస్తుంది.
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది..
మీరు సహజంగా చేసే మార్నింగ్ వాక్ ద్వారా మీ శరీరంలో ఎండార్ఫిన్ అనే యాసిడ్ విడుదలవుతుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఉదయపు నడక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది. తద్వారా మీరు సంతోషంగా ఉండగలుగుతారు.
నిద్రను మెరుగుపరుస్తుంది..
ఉదయపు నడక చేసే సమయంలో శరీరానికి తగిలే సహజ సూర్యకాంతి డీ విటమిన్‌ను అందిస్తుంది. ఇది మీ శరీరంలోని అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.
ప్రకృతితో స్నేహం..
ప్రకృతితో కనెక్ట్ అవ్వడానికి మార్నింగ్ వాక్‌లకు మించిన సాధనము లేదు. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి ఉదయం పూట మనకు లభిస్తుంది. అంతేకాకుండా ప్రకృతి అందాలను మీరు ఉదయం సమయాల్లోనే ఆస్వాదించగలరు. ప్రకృతి నడుమ ఉదయం కొద్ది గంటలు సమయం గడపడం ద్వారా మీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది.
బరువు బ్యాలెన్స్ చేస్తుంది..
మీరు రెగ్యులర్‌గా చేసే మార్నింగ్ వాక్‌తో పాటు మీరు తీసుకునే సమతుల్య ఆహారం కూడా మీ బరువును నియంత్రణలో ఉంచుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఉదయపు నడక ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మీ శరీరంలోని అధిక క్యాలరీలను కరిగిస్తుంది. తద్వారా మీరు సులువుగా బరువు తగ్గవచ్చు. మార్నింగ్ వాక్ అనేది ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేస్తుంది.
కొత్త పరిచయాలను పెంచుతుంది..
మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేస్తే అది ఒక సామాజిక ప్రక్రియగా మారుతుంది. అలాగే పరస్పరంగా కొత్త పరిచయాలు పెరుగుతాయి. దీంతో మీరు ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా ఇది మీ మానసిక ప్రశాంతతపై సానుకూల ప్రభావం చూపుతుంది.
ఎముకలు మరింత దృఢంగా..
ఉదయపు నడక వల్ల లభించే డీ-విటమిన్ మీ ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. ఇది ఎముకలకు సంబంధించిన వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. అంతేకాకుండా మీ శరీర కండరాలు బలంగా తయారవుతాయి.
గుండె పదిలం..
రెగ్యులర్ మార్నింగ్ వాక్ మీ శరీరంలోని రక్తపోటును నియంత్రించడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలను నివారిస్తుంది.
మెదడుకు పదును..
మార్నింగ్ వాక్‌తో పాటు మీరు చేసే శారీరక శ్రమ మీ మెదడు పనితీరు ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇది మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేందుకు దోహదపడుతుంది.
Spices For Weight Loss : బరువు తగ్గి నాజూగ్గా కనిపించాలా? ఈ సుగంధ ద్రవ్యాలను ట్రై చేయండి!
How To Look Young Forever : ఆరు పదుల వయసులోనూ యవ్వనంగా కనిపించాలా?.. ఈ 10 టిప్స్ పాటిస్తే చాలు!