కొందరికి ఉదయం లేవడమంటే పరమ చిరాకు. కాలేజీ లేకపోతే తొమ్మిదిగంటలకుగాని కళ్లు తెరవరు. ఇందులో సమస్యలేదు కానీ ఉద్యోగాలంటూ వచ్చాక ఇబ్బందులు తప్పవు. అలాంటివాళ్లు తమను ఇలా మార్చుకోవచ్చు..
లాభాలేమిటీ?
వేకువన నిద్రలేచే అలవాటు లేకపోతే ఏ పని అప్పగించినా మందకొడిగా ఉంటామనే ముద్రమనపై పడిపోతుంది. ఇది అలా ఉంచితే అందాల సూర్యోదయం, వేకువ వాతావరణంలోని నిశ్శబ్దం, ఆ సమయంలో మన మనసుకుండే ఏకాగ్రతా, అందులోని ఆనందం ఇవన్నీ కోల్పోతాం. వేకువన మేల్కోవడంతో వచ్చే ఆ లాభాలన్నీ ఓ చోట రాయండి.
రెండుగంటలపాటు
ఉదయం లేచినప్పట్నుంచి రెండు గంటలపాటు మిమ్మల్ని ఆనందంగా ఉంచగల వివిధ వ్యాపకాల్లో నిమగ్నంకండి. నడక, ఇష్టమైన పుస్తకం చదవడం, రాయడం, చిత్రలేఖనం.. ఇలా ఏదైనా సరే!
‘ఎరుక’ ఉండాలి
ఈ మధ్య ధ్యానంతోపాటూ ఎక్కువగా వినిపిస్తున్న పదం ఈ ‘ఎరుక’(మైండ్‌ఫుల్‌నెస్). అంటే.. చేసే ప్రతి పనినీ నిశితంగా ఆస్వాదించడమే. ఉదయం నడుస్తూ చల్లటి గాలీ, పక్షుల కిలకిలరావాలూ తనివితీరా ఆస్వాదించండి. అద్భుతంగా అనిపిస్తుంది.
మూడువారాలు
మూడువారాలు.. అంతరాయం లేకుండా త్వరగా నిద్రలేవండి. క్రమంగా వేకునే మేల్కొనడం మీ దినచర్యలో భాగమవుతుంది.
ఇదీ చదవండి: వదనం మధురం.. మచ్చలు దూరం!