ETV Bharat / sukhibhava

తులసి కషాయం తాగితే జలుబు, దగ్గులతోపాటు 'ఒత్తిడి' మటుమాయం! - తులసి ఔషధ గుణాలు

Tulasi Health Benefits In Telugu : భారత సంస్కృతిలో తులసి చెట్టుకు ఎంతో పవిత్రత ఉంది. ఇదొక దివ్యౌషధం. అందుకే ఆయుర్వేదంలో దీనిని అనేక రోగాల నివారణకు వాడతారు. అందుకే ఈ ఆర్టికల్​లో ఈ పవిత్ర ఔషధి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Holy Basil Help for Weight Loss
Tulsi For Weight Loss
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2024, 12:04 PM IST

Tulasi Health Benefits : రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. శీతాకాలంలో ఇవి సాధారణమే అయినప్పటికీ, వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అందుకోసం మంచి ఔషధ గుణాలున్న తులసి కషాయం చాలా బాగా ఉపయోగపడుతుంది. తులసికి భారత సంప్రదాయాలలోనే కాదు, ఔషధపరంగానూ ఎంతో ప్రాముఖ్యత ఉంది. జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి కాలానుగుణ వ్యాధుల నివారణలో తులసి బాగా ఉపయోగపడుతుంది. తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా తులసి అకులతో చేసే కషాయాన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అదనపు కొవ్వును తగ్గించడంతో పాటు శరీరంలో పెరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంలోనూ ఇవి సహాయపడతాయి. తులసి కషాయాన్ని పరగడుపునే తాగటం వల్ల గొంతు నొప్పి, జలుబు, దగ్గు లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. తులసి ఆకులను పచ్చిగా తీసుకోవడం కంటే, దాన్ని కషాయంగా తయారు చేసుకొని తాగడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. అందుకే తులసి కషాయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణ శక్తిని పెంచుతుంది :
తులసిలో జీర్ణశక్తిని పెంచే గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే తులసి కషాయం తాగితే, జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. క్యాలరీలు త్వరగా కరిగి శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

ఒత్తిడి తగ్గుతుంది :
ఒత్తిడిని నియంత్రించడంలోనూ తులసి కషాయం ఉపయోగపడుతుంది. ఇది ప్రధానంగా యాంటీ యాంగ్జయిటీ లక్షణాలను, సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వివిధ పరిశోధనల ప్రకారం, తులసిలో ఓర్పును పెంచే గుణంతో పాటు, ఆందోళన నుంచి ఉపశమనం కలిగించే లక్షణం కూడా ఉంది.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు :
బరువు అదుపులో ఉంచుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకం చాలా ముఖ్యమైనది. తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ నిరోధకతకు దోహదపడతాయి.

జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది :
అల్లం, జీలకర్ర, సోపు లాంటి వాటితో కలిపి, తులసి కషాయం తీసుకోవడం వలన జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఫలితంగా శరీరం పోషకాలను సులువుగా గ్రహించగలుగుతుంది.

తులసి కషాయం తయారీకి కావాల్సిన పదార్థాలు

  • 10-12 తాజా తులసి ఆకులు
  • కొద్దిగా అల్లం
  • 1 టీ స్పూన్ జీలకర్ర
  • 1 టీ స్పూన్ సోపు గింజలు
  • 1-2 నల్ల మిరియాలు
  • 1-2 దాల్చిన చెక్క
  • 4-5 కప్పుల నీరు

తులసి కషాయాన్ని తయారు చేసే విధానం

  • ముందుగా 4-5 కప్పుల నీటిని బాగా మరిగించాలి.
  • నీరు మరిగిన తర్వాత, అందులో తులసి ఆకులు, తురిమిన అల్లం, జీలకర్ర, సోపు గింజలు, నల్ల మిరియాలు, దాల్చిన చెక్కలను వేయాలి.
  • ఇవన్నీ కలిపిన తర్వాత మంటను కొద్దిగా తగ్గించి 10-15 నిమిషాల పాటు మరిగించాలి.
  • చివరిగా తులసి ఆకులను, మిగతా సుగంధ ద్రవ్యాలను వడగట్టాలి.
  • వడకట్టిన తులసి కషాయాన్ని ఒక కప్పులో పోసుకొని గోరు వెచ్చగా తాగాలి.
  • కావాలనుకుంటే రుచి కోసం మీరు తేనె లేదా నిమ్మకాయ రసాన్ని కలుపుకోవచ్చు.

అమృత తులసి కషాయం : శీతాకాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్​ను అమృత తులసి కషాయం తగ్గిస్తుంది. మరి ఈ కషాయం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ముందుగా మనం తులసి ఆకులు, గుడూచీ చూర్ణం, అల్లం తురుము, మిరాయాలు, నేలవేము చూర్ణాలను సిద్ధం చేసుకోవాలి.
  • పొయ్యి వెలుగించుకుని, ఒక పాత్రలో రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని వేడి చేయాలి.
  • ఈ వేడి నీళ్లలోనే తులసి ఆకులు వేయాలి.
  • గుడూచీ చూర్ణం, అల్లం తురుము, నేలవేము చూర్ణాలను ఒక్కో చెంచా చొప్పున వేయాలి.
  • ఒక అరచెంచా మిరియాలు కూడా వాటిలో వేసి, చక్కగా మరిగించాలి.
  • తరువాత ఒక మంచి గుడ్డతో ఆ నీటిని వడకట్టాలి.
  • ఈ విధంగా తయారు చేసుకున్న అమృత తులసి కషాయం వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గించి, శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

డిప్రెషన్ ఒక ఊబి - స్విమ్మింగ్ పూల్​లా మార్చేస్తే పోలా!

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ - నిద్ర చాలకనే వచ్చాయనుకుంటున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.