ETV Bharat / sukhibhava

వేసవిలో జుట్టు నిగనిగలాడేందుకు.. చేయండిలా!

ఎండలో తిరిగితే జుట్టు కళ (hair loss in summer) తప్పుతుంది. వేడి మూలంగా వెంట్రుకలు నిగనిగలాడటానికి (hair protection in summer) తోడ్పడే ప్రోటీన్ దెబ్బతింటుంది. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలూ విపరీత ప్రభావం చూపుతాయి. అయితే కొన్ని జాగ్రత్తలతో వేసవిలో వెంట్రుకలను కాపాడుకోవచ్చు.

hair protection tips
వేసవిలో జుట్టు రాలకుండా టిప్స్
author img

By

Published : Oct 4, 2021, 7:30 AM IST

వేసవి వచ్చిందంటే మండే ఎండలతో జుట్టు జిడ్డుగా (hair loss in summer) తయారవుతుంది. వెంట్రుకలు నిగనిగలాడటానికి తోడ్పడే ప్రోటీన్ దెబ్బతింటుంది. కొన్ని జాగ్రత్తలు పాటించి ఎండ బారి నుంచి వెంట్రుకలను (hair protection in summer) కాపాడుకోవచ్చు. అవేంటో చూద్దాం.

  • వేసవిలో వెంట్రుకలు, మాడు జిడ్డుగా అవుతాయి. అందువల్ల తరచూ షాంపూతో (hair problem solution tips) తలస్నానం చేస్తే వెంట్రుకలు నిగనిగలాడతాయి.
  • వెంట్రుకలకు కండిషనర్​ను రాసి, కొద్దిసేపు షవర్ క్యాప్ ధరించాలి. ఇది ఎండకు ప్రభావితమైన కురులు తిరిగి కోలుకోవటానికి తోడ్పడుతుంది.
  • సముద్రతీర ప్రాంతాల్లో షికారు చేసేవారు ఎస్​పీఎఫ్​తో కూడిన కండిషనర్​ను జుట్టుకు రాసుకోవాలి. దీంతో సూర్యరశ్మిలో అతినీలలోహిత కిరణాల ప్రభావం బారి నుంచి వెంట్రుకలను కాపాడుకోవచ్చు.
  • ఎక్కువసేపు ఎండలో తిరగాల్సి వస్తే వెడల్పయిన అంచు గల టోపీ ధరించటం మంచిది. ఇది వెంట్రుకలతో పాటు చెవులు, మెడకూ రక్షణ ఇస్తుంది.
  • వాతావరణం చాలా వేడిగా ఉన్నప్పుడు వెంట్రుకలు చిక్కుపడే అవకాశం ఎక్కువ. శుభ్రంగా దువ్వుకొని జడ వేసుకోవటం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. వెంట్రుకలు చిక్కు పడకుండా చూసే నూనెలూ వాడుకోవచ్చు.
  • ఈతకు వెళ్లేవాళ్లు ముందుగా మంచి నీటితో తలను పూర్తిగా తడపాలి. దీనివల్ల ఉప్పునీటిని, కొలనులోని రసాయనాలను వెంట్రుకలు స్వీకరించవు. ఈత కొట్టాక తలను శుభ్రంగా తుడుచుకోవటం మంచిది. అలాగే తగినంత నీరు తాగుతూ ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవచ్చు. ఇది వెంట్రుకలకు మేలు చేస్తుంది.
  • వెంట్రుకలను ఆరబెట్టే డ్రయర్లు వంకర్లు తిప్పే సాధనాలను ఎండకాలంలో వాడకపోవటమే ఉత్తమం.
  • వేడినీటితో తలస్నానం చేస్తే వెంట్రుకలు పొడిబారతాయి. అదే చల్లటి నీరు వెంట్రుకల పైపొర మూసుకుపోయేలా చేసి లోపలి తేమను పట్టి ఉంచుతుంది. అందువల్ల వేసవిలో చన్నీళ్ల స్నానం చేయటం మంచిది.

ఇదీ చదవండి:Beauty Tips: నిగనిగలాడే ఒత్తయిన కురులు మీకూ కావాలా..?

అమ్మో.. ఆరున్నర అడుగుల జుట్టా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.