ETV Bharat / sukhibhava

టీ తాగేటప్పుడు ఈ స్నాక్స్ తింటున్నారా? - జాగ్రత్త, మీ ఆరోగ్యం డేంజర్​లో పడ్డట్లే!

These Foods To Avoid With Tea : మార్నింగ్ లేవగానే మనలో ఎక్కువ మందికి టీ తాగే అలవాటు ఉంది. ఇక చాయ్ ప్రియులైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చాలా మందికి టీతో పాటు స్నాక్స్ తీసుకునే అలవాటు కూడా ఉంటుంది. అయితే మీరు చాయ్ తాగేటప్పుడు తీసుకోకూడని కొన్ని ఆహార పదార్థాలూ ఉన్నాయి. అవి తీసుకోవడం ద్వారా పలు సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 11:03 AM IST

Tea
Tea

These Foods You Should Never Have with Tea : మనలో చాలా మందికి చాయ్ తాగకపోతే ఆ రోజే ప్రారంభం కాదు. నిద్ర లేచీ లేవగానే ఒక కప్పు వేడి వేడి టీ కడుపులోకి వెళ్లాల్సిందే. ఇకపోతే కొందరు డైలీ కనీసం నాలుగైదు సార్లు అయినా వేడి వేడి చాయ్ తాగేస్తుంటారు. అది లేకుంటే ఏదో కోల్పోయినట్లుంటుందని చాలా మంది చెబుతుంటారు. నిజానికి చాయ్ అలసిపోయిన శరీరానికి కాస్త ఉత్సాహాన్నిస్తుంది. ఇక టీ ప్రేమికులైతే.. ఒక కప్పు వేడి చాయ్(Tea) లేని రోజును వారు అస్సలు ఊహించుకోలేరు. కేవలం పాలతో తయారుచేసిన టీ మాత్రమే కాకుండా గ్రీన్ టీ(Green Tea), బ్లాక్​ టీ, మందార టీ.. ఇలా ఎన్నో వేరియంట్స్ ఉన్నాయి. అయితే చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే చాయ్ తాగేటప్పుడు ఏదో ఒక స్నాక్స్ తీసుకోవడం. అయితే.. ఆ స్నాక్స్​లో ఈ ఆహార పదార్థాలు ఉండకుండా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవి తీసుకోవడం ద్వారా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటి? అవి తీసుకుంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్​ వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

టీ తాగుతూ తినకూడని ఐదు ఆహార పదార్థాలివే..

శనగపిండితో చేసిన వంటకాలు : సాధారణంగా ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే టీతో పాటు స్నాక్స్ అందిస్తుంటాం. ఆ స్నాక్స్ అనేవి దాదాపుగా శనగపిండితో చేసినవే ఉంటాయి. అందులో ముఖ్యంగా పకోడీలు, నామ్ కీన్​ వంటివి ఉంటాయి. అయితే ఎప్పుడూ కూడా టీ తాగే సమయంలో శనగ పిండితో చేసిన స్నాక్స్ తీసుకోకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే అలా తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఆ తర్వాత అది ఎసిడిటీకి దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు.

నిమ్మకాయ : చాలా మంది నిమ్మకాయ బరువు తగ్గిస్తుందని టీ ఆకులతో కలిపి తీసుకుంటుంటారు. కానీ అలా తీసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే నిమ్మకాయ సహజ సిద్ధమైన సిట్రస్ కాబట్టి.. టీతో పాటు దానిని కలిపితే.. అది ఆమ్లంగా మారుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరానికి దారి తీస్తుంది.

పసుపు : మీరు టీ తాగేటప్పుడు పసుపు కలిపిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిని కలిపి తీసుకుంటే అది గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ లేదా మలబద్ధకం వంటి సమస్యలకు దారి తీస్తుంది. పసుపు, టీ పొడి శరీరానికి తగిన కలయిక కాదు. అంటే ఈ రెండు ఒకదానితో ఒకటి అనుకూలంగా ఉండవన్న మాట.

చల్లని ఆహార పదార్థాలు : చాలా మంది టీ తాగే సమయంలో చల్లటి ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు. కానీ అలా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వేరువేరు ఉష్ణోగ్రతల ఆహారాన్ని కలిపి తీసుకోవడం ద్వారా అది అజీర్ణానికి దారితీయడంతో పాటు జీర్ణవ్యవస్థకు అంతరాయం కలిగిస్తుంది. అలాగే ఇది వికారాన్ని కలిగిస్తుంది. వేడి టీ తాగిన అరగంట వరకు చల్లని పదార్థాలను తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

గ్రీన్ వెజిటేబుల్స్ : ఇక వేడి టీతో ఆకుపచ్చ కూరగాయలను కలిపి తీసుకోకూడదు. అలా తీసుకుంటే అది మీ శరీరానికి హాని కలిగించవచ్చు. ముఖ్యంగా వీటి కలయిక శరీరంలో ఐరన్ శోషణను నిరోధిస్తుంది. ఎలాగంటే.. టీలో టానిన్లు, ఆక్సలేట్‌లు అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మొక్కల ఆధారిత ఐరన్​ శోషణను నిరోధించగలవు. కాబట్టి టీ తాగేటప్పుడు ఐరన్ ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవద్దంటున్నారు నిపుణులు.

మీకు 'గ్రీన్ టీ' అలవాటుందా? - ఇలా తాగితే చాలా డేంజర్!

మీకు బ్లూ టీ గురించి తెలుసా? బరువు తగ్గి నాజూగ్గా మారిపోతారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.