ETV Bharat / sukhibhava

Lemon water: నిమ్మరసంతో బోలెడన్ని ప్రయోజనాలు! - ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు

చిన్న చిన్న అలవాట్లే కావొచ్చు. చూడటానికి తేలికగానే అనిపించొచ్చు. కొందరు అసలే పట్టించుకోకపోనూవచ్చు. కానీ అవి మన ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. అలాంటిదే నిమ్మరసం నీరు. ఉదయం పూట నిమ్మరసం(Lemon Water Benefits) కలిపిన నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవటం ఖాయం!

Lemon water
నిమ్మరసం నీళ్లతో లాభాలు
author img

By

Published : Oct 22, 2021, 9:08 PM IST

ఉదయం పూట నిమ్మరసం(Lemon Water Benefits) కలిపిన నీళ్లు తాగితే బోలెడు ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. జీర్ణశక్తి మెరుగు: మనం తిన్న ఆహారం అరగటానికి జీర్ణాశయంలోని ఆమ్లాలు తోడ్పడతాయి. అయితే వయసు పెరుగుతున్నకొద్దీ వీటి స్థాయులు తగ్గుతూ వస్తుంటాయి. నిమ్మరసంలోని ఆమ్లాలు వీటికి చేదోడు వాదోడుగా నిలిచి.. ఆహారం జీర్ణం కావటానికి దోహదం చేస్తాయి.
  2. నీటిశాతం పడిపోకుండా: మనలో చాలామంది తగినంత నీరు తాగరు. దీంతో ఒంట్లో నీటిశాతం పడిపోతుంది. దీంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలూ ముంచుకొస్తాయి. అదే రోజూ ఉదయాన్నే నిమ్మరసం(Lemon Water Benefits) నీళ్లు తాగటం అలవాటు చేసుకుంటే ఒంట్లో నీటి శాతం పడిపోకుండా చాలావరకు నివారించుకోవచ్చు. పైగా నిమ్మరసం కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండానూ కాపాడుతుంది.
  3. జబ్బులకు కళ్లెం: నిమ్మకాయలో విటమిన్‌ సి దండిగా ఉంటుంది. సగం నిమ్మచెక్క రసం తీసుకున్నా రోజుకు అవసరమైన విటమిన్‌ సిలో ఆరో వంతుకు పైగా అందుతుంది. ఇది రోగనిరోధకశక్తిని పుంజుకునేలా చేయటంతో పాటు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. గాయాలు త్వరగా మానటానికి తోడ్పడతుంది. ఇక నిమ్మరసంలోని ఫైటోన్యూట్రియంట్లు యాంటీఆక్సిడెంట్లుగానూ పనిచేస్తాయి. ఇవి విశృంఖల కణాల మూలంగా తలెత్తే అనర్థాల నుంచి కాపాడతాయి.
  4. నాడులు హుషారు: నిమ్మరసంలో(Lemon Water Benefits) మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది లేకపోతే శరీరం సరిగా పనిచేయదు. నాడులు-కండరాల మధ్య సమాచారానికి ఇది అత్యవసరం. అన్ని కణాలకు పోషకాలు అందటానికి, వ్యర్థాలను బయటకు పంపటానికీ ఇది తోడ్పడుతుంది. రక్తపోటుపై ఉప్పు చూపే ప్రభావాన్ని తగ్గించటానికీ మెగ్నీషియం ఉపయోగపడుతుంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.