ETV Bharat / sukhibhava

ఈ విషయంలో కాలేయం పట్ల శ్రద్ధ తీసుకోండి

గతి తప్పిన జీవనశైలి కారణంగా పెనుముప్పు ఎదురవుతోంది. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం.. తదితర కారణాల వల్ల 9-32 శాతం మంది భారతీయుల్లో మద్యంతో సంబంధం లేకుండా కాలేయంపై కొవ్వు నిల్వలు పెరుగుతున్నాయి.

ఈ విషయంలో కాలేయం పట్ల శ్రద్ధ తీసుకోండి
ఈ విషయంలో కాలేయం పట్ల శ్రద్ధ తీసుకోండి
author img

By

Published : Mar 2, 2021, 7:00 AM IST

సాధారణంగా మద్యం తీసుకోవడం వల్ల కాలేయంపై కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. దీన్నే వైద్య పరిభాషలో ‘నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌’ అని పిలుస్తారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది. అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్‌ తరహాలోనే ‘కాలేయంపై కొవ్వు నిల్వలు’ పెరిగిపోవడాన్ని కూడా జీవనశైలి వ్యాధుల(నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజ్‌-ఎన్‌సీడీ) పరిధిలోకి కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా తీసుకొచ్చింది. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి, నివారణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచిస్తూ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఏమిటీ ప్రమాదం?

సాధారణ ప్రజల్లో 20-30 శాతం మంది ‘ఫ్యాటీ లివర్‌’ ఉన్నవారుంటారు. కాలేయ కణాలపై దుష్ప్రభావం చూపనంత వరకూ, వాపు రానంత వరకూ ప్రమాదం లేదు. ప్రమాదకర స్థాయిలో కొవ్వు పేరుకుపోతే అనారోగ్యం తీవ్రమవుతుంది. కాలేయ కణాలు దెబ్బతిని వాపు వస్తుంది. కాలేయం కుంచించుకుపోతుంది(లివర్‌ సిర్రోసిస్‌). క్యాన్సర్‌కూ దారితీస్తుంది. ఊబకాయానికి తోడుగా మధుమేహం ఉన్నవారిలో 40-80 శాతం మందిలో ‘నాన్‌ ఆల్కహాలిక్‌ లివర్‌ డిసీజ్‌’ ఉన్నట్లుగా పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా తొలిదశలో వ్యాధి లక్షణాలేమీ కనిపించవు. పొట్టకు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ లేదా సీటీ స్కాన్‌ వంటి పరీక్షలు చేసినప్పుడే బయటపడుతుంది.

జీవనశైలిలో మార్పులు అవసరం

ఆశా ఆరోగ్య కార్యకర్తలు, వైద్యసిబ్బంది క్షేత్రస్థాయిలో ఈ వ్యాధిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. జనాభా ప్రాతిపదికన పరీక్షలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలూ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. కొవ్వు పదార్థాలను తగ్గించాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయాలి. బరువు తగ్గడం, రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవాలి. పురుషులు తమ నడుము చుట్టుకొలత 90 సెం.మీ కంటే ఎక్కువగా, మహిళలు 80 సెం.మీ. కంటే ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి.

ఇదీ చూడండి: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా... అయితే ఈ స్టోరీ మీకోసమే...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.