ETV Bharat / sukhibhava

Tea for weight loss: టీ తాగితే బరువు తగ్గుతారా? - గ్రీన్ టీ బరువు తగ్గించడం

Tea for weight loss: మనిషి జీవితంలో టీ పాత్ర చాలా అమోఘమైనది. కాస్త తలనొప్పిగా ఉన్నా, అలసటగా ఉన్నా.. టీ తాగడం జీవితంలో ఓ అంతర్భాగమైంది. అయితే, టీ వల్ల బరువు తగ్గుతారా? శరీరంలో కొవ్వు తగ్గించుకునేందుకు ఎలాంటి టీ తాగాలి?

tea for weight loss
could tea help you lose weight
author img

By

Published : Mar 22, 2022, 4:32 PM IST

Tea Help You Lose Weight: మనలో చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు మొదలవ్వదు. సహజంగా టీ.. నరాల ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. మనం తాగిన వెంటనే మనకు ఓ శక్తిమంతమైన భావనను కలిగిస్తుంది. అయితే, అధికంగా టీ తాగడం వల్ల అనేక దుష్పరిణామాలు ఉంటాయని అంటుంటారు. సాధారణ టీ కంటే హెర్బల్ టీని తగినంత మోతాదులో తీసుకోవడం వల్ల అనారోగ్యాల నుంచి మనల్ని కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

weight loss tips

హెర్బల్ టీ.. మన ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి, మూసుకుపోయిన రక్తనాళాలను వ్యాకోచింప చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. తేనెతో చేసిన హెర్బల్ టీ, గొంతు ఇన్ఫెక్షన్లకు మంచి పరిష్కారాన్ని ఇస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇలా నిత్యం మనం టీకి బదులు హెర్బల్ టీని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవచ్చు.

weight loss black tea

తరచుగా బ్లాక్ టీ తీసుకునే వాళ్లు బరువు తగ్గిన దాఖలాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. టీలో ఒక రకమైన ఫ్లెమనాయిడ్స్ ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపర్చి, శరీర కొవ్వులను త్వరగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. అనేక టీలలో ఉండే కెఫిన్.. శక్తి వినియోగాన్ని పెంచుతుంది. దీని వల్ల శరీరం మరింత కేలరీలను కరిగిస్తుంది.

weight loss green tea

గ్రీన్ టీని ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఆరోగ్యం కోసం తాగుతున్నారు. దీన్ని క్రమం తప్పకుండా తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందులో బరువు తగ్గడం కూడా ఒకటి. అయితే కేవలం టీ తాగితేనే బరువు తగ్గిపోతామని అనుకోకూడదు. మంచి డైట్, శారీరక వ్యాయామాన్నీ మన జీవనశైలిలో భాగం చేసుకోవాలి.

బ్లాక్​ టీ, గ్రీన్​ టీతో పాటు మార్కెట్​లో ఎన్నో రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల ప్రయోజనాలు, బరువు తగ్గేందుకు మరిన్ని సలహాల కోసం కింది వీడియోను చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:

ఈ యోగాసనాలతో నెలరోజుల్లోనే ఊబకాయానికి చెక్​!

మరీ సన్నగా ఉన్నారా? ఇలా చేసి బరువు పెరగండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.