పిల్లల్ని, పువ్వుల్ని ఎంత శ్రద్ధగా చూసుకుంటామో మన శరీరాన్ని కూడా అంతే జాగ్రత్తగా, ప్రేమగా చూసుకోవాలి. యోగా(yoga asanas).. ఇందుకోసం ఉపయోగపడుతుంది. అయితే మన యోగా చేయాలని అనుకుంటాం కానీ ఏ ఆసనం వేయాలి. ఎలా వేయాలి అనేది చాలావరకు తెలియదు. అలాంటి వాళ్ల కోసమే ఈ స్టోరీ. ఇందులో చెప్పిన ఆసనాన్ని, నిపుణుల పర్యవేక్షణలో ట్రై చేసి చూడండి. అద్భుతమైన ఫలితాల్ని(supta vajrasana benefits) పొందండి.
సుప్త వజ్రాసనం
ఈ ఆసనం వేయడం కోసం ముందుగా మోకాళ్లపై కూర్చుని వెన్నముకను నిటారుగా ఉండేలా చూసుకోవాలి. నమస్కారం పెట్టినట్లు చేతుల్ని జోడించి(supta vajrasana yoga) ఛాతీకి తగిలించాలి. ఆ తర్వాత దిగువ వీడియోలో చూపించినట్లు పోజులు మార్చుతూ ఉండాలి. ఈ ఆసనాన్ని వేయడం కంటే ముందు కాస్త వార్మప్ కూడా చేయాలి.
సుప్త వజ్రాసనం వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్ సమస్యలు ఉన్న వారికి ఉపశమనం కలుగుతుంది. మెదడుకు రక్త ప్రసరణ మెరుగవుతుంది(supta vajrasana benefits). ఎక్కువ కోపం ఉంటే అది నియంత్రణలోకి వస్తుంది.
మనలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఈ సుప్త వజ్రాసనం పెంపొందిస్తుంది. స్త్రీ, పురుషుల్లో పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు క్రమబద్ధీకరిస్తుంది.
జీర్ణ సమస్యలు, మలబద్ధకం సమస్యలను ఈ ఆసనంతో తేలిగ్గా నివారించొచ్చు. వెన్ను నరాలు, థైరాయిడ్ గ్రంధులపై ప్రభావాన్ని చూపి వాటిని సుప్త వజ్రాసనం క్రమబద్ధీకరిస్తుంది. దీనివల్ల ఛాతీ, పొత్తి కడుపు భాగాలు స్ట్రెచ్ అవుతాయి. మన శరీరంలోని కొవ్వును కూడా తగ్గించుకోవచ్చు.
మోకాళ్లు, కీళ్ల నొప్పులు గాయాలు ఉన్నవారు.. గర్భిణి, నెలసరి ఉన్న సమయంలో, హై బీపీ ఉన్నవాళ్లు.. ఈ ఆసనం వేయకపోవడం మంచిది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">