మన శరీరం సహకరిస్తేనే మనం రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాం. మరి అలా ఉండాలంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ( Body Flexibility) పెంచుకోవడం తప్పనిసరి. అందుకోసం(Body Flexibility) ఈ చిన్నపాటి వ్యాయామాలను ట్రై చేసేయండి..
- ముందుగా.. చేతులు నడుంపై పెట్టుకుని మెడను కుడివైపునకు, ఎడమవైపునకు తిప్పాలి.
- ఆ తర్వాత మెడను పైకి, కిందకు వంచాలి.
- కుడి భుజాన్ని నెమ్మదిగా వెనుక నుంచి ముందుకు తిప్పాలి. ఆ తర్వాత ఎడమ భుజాన్ని కూడా ఇదే తరహాలో తిప్పాలి.
- ముందుగా ఎడమ చేతిని నడుం వెనుక పెట్టుకుని... కుడి చేతిని తలపై పెట్టుకుని ఎడమవైపు తిరగాలి. ఆ తర్వాత చేతిని మార్చి చేయాలి. అలా ఓ నాలుగైదు సార్లు చేయాలి.
- చేతులను, కాళ్లను క్రాస్లా మలిచి, కిందకు వంగి, పైకి లేవాలి.
- ఎడమ కాలిని ముందు పెట్టి, కుడి కాలిని వెనక పెట్టి.. ఎడమ కాలిని కుడి చేతితో తాకాలి. కుడి కాలిని ఎడమ చేతితో తాకాలి. ఆ తర్వాత కుడి కాలు ముందు పెట్టి చేయాలి.
ఇలాంటి వ్యాయామాలను రోజూ చేస్తే.. బాడీ ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి: