ETV Bharat / sukhibhava

వర్షాకాలంలో అరికాళ్లల్లో రంధ్రాలు, దుర్వాసన.. ఇలా చేస్తే సమస్యకు చెక్​ - What Is Pitted keratolysis Symptoms

What Is Pitted keratolysis In Telugu : వర్షాకాలంలో సీజనల్​ వ్యాధుల బారిన పడే అవకాశం ఎంత ఉందో.. అదే విధంగా చర్మ వ్యాధులు కూడా ఈ కాలంలో మనల్ని వేధిస్తుంటాయి. అయితే ముఖ్యంగా చర్మ వ్యాధుల్లో 'పిట్టెడ్​ కెరిటోలైసిస్​' అనే సమస్య తరచూ కొందరిని ఇబ్బంది పెడుతుంటుంది. మరి 'పిట్టెడ్​ కెరిటోలైసిస్​' అంటే ఏమిటి? ఇది ఎవరికి వస్తుంది? దీనికి ట్రీట్​మెంట్​ ఉందా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

What Is Pitted keratolysis Causes Symptoms Full Details Here
అరికాళ్లల్లో రంధ్రాలు ఏర్పడి.. దుర్వాసన వస్తుందా.. ఇలా ట్రై చేస్తే సమస్యకు స్వస్తి..
author img

By

Published : Aug 2, 2023, 7:50 AM IST

Skin Problems In Rainy Season : వర్షాకాలం అంటేనే చాలా మంది భయపడతారు. ఎందుకంటే వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే సీజన్ ఇదే కాబట్టి. అయితే వర్షాకాలంలో జ్వరం, దగ్గు, జలుబు వంటి సాధారణ అనారోగ్య సమస్యలే కాకుండా ఇతర రకాల వ్యాధులు కూడా వస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చర్మ వ్యాధుల గురించి. అయితే వర్షాకాలంలో కొందరిని 'పిట్టెడ్​ కెరటోలైసిస్'​ అనే చర్మవ్యాధి సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇంతకీ 'పిట్టెడ్​ కెరటోలైసిస్' అంటే ఏమిటి..? ఇది శరీరంలోని ఏ భాగానికి సోకుతుంది..? మరి దీనికి చికిత్స ఉందా..? ఇది మళ్లీ మళ్లీ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

పిట్టెడ్​ కెరటోలైసిస్ అంటే ఏమిటి..?
What Is Pitted keratolysis : 'పిట్టెడ్​ కెరటోలైసిస్' అనేది ఒక బ్యాక్టీరియల్​ ఇన్ఫెక్షన్​. ఇది ముఖ్యంగా మనిషి చర్మంపై ప్రభావం చూపిస్తుంది. అది కూడా అరికాళ్లు, అరిచేతుల్లో ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అయితే ఈ చర్మవ్యాధి అంత ప్రమాదకరమైనది కాకపోయినా అది వచ్చినప్పుడు మాత్రం చాలా మంది కొన్ని ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ కెరటోలైసిస్​ వ్యాధి ఎక్కువగా నీటిలో ఉండేవారికి, తేమ శాతం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పని చేసేవారిలో వస్తుంది. అయితే కేవలం వీరికి మాత్రమే కాకుండా కొన్నిసార్లు శరీరం నుంచి అధిక చెమట విడుదలతో బాధపడే వారిలోనూ ఈ బ్యాక్టీరియా త్వరగా వ్యాప్తిస్తుంది. సాధారణం కంటే ఎక్కువగా చెమట విడుదలయ్యే వారి అరికాళ్లల్లో, అరిచేతుల్లో ఇది వస్తుంది. ముఖ్యంగా వీరు గంటల తరబడి బూట్లు, సాక్స్​లు ధరించడం కారణంగా ఆయా ప్రదేశాల్లో గాలి సోకకుండా బిగుతుగా ఉండడం ద్వారా కూడా ఈ ఇన్ఫెక్షన్​ ఎటాక్​ చేస్తుంది. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో వీరు ఈ సమస్యను ఎదుర్కొంటారు.

ఎలా గుర్తించాలి..?
How To Identify Pitted keratolysis On Feet : సాధారణంగా ఈ బ్యాక్టీరియా తడిగా ఉన్న అరికాళ్లకు లేదా అరిచేతులపై త్వరగా వృద్ధి చెందుతుంది. గంటల తరబడి నీటిలో ఉన్నా.. ఎక్కువ సేపు అరికాళ్లకు, అరిచేతులకు గాలి తగలకుండా ఉండే గ్లౌజులు, సాక్సులు, బూట్లు వేసుకున్నా ఈ బ్యాక్టీరియా ఏర్పడుతుంది. దీంతో ఆయా భాగాల్లో గాలి పోయేందుకు వీలు లేకపోవడం వల్ల చర్మం పైపొర మొత్తం తెల్లగా మారి 1 నుంచి 3 మిల్లిమీటర్ల పరిమాణంలో చిన్నపాటి రంధ్రాలు ఏర్పడతాయి. ఇదే 'పిట్టెడ్​ కెరటోలైసిస్'​ ప్రధాన లక్షణం. అయితే ఇవి వచ్చినప్పుడు పెద్దగా నొప్పి వంటిది ఏమి ఉండదు. కానీ, దురద, దుర్వాసన మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. వీటి ద్వారా వచ్చే వాసనతో పనిప్రదేశాల్లోని వారు కూడా కాస్త ఇబ్బందికి లోనవుతుంటారు.

వీరికి ముప్పు..
Who Affects For Pitted keratolysis : క్రిములు ఎక్కువగా చీకటి, తడి, తేమ ప్రదేశాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతాయి. ఇళ్ల నిర్మాణాలప్పుడు కూలీలు ధరించే పెద్ద పెద్ద బూట్లు వేసుకోవడం వల్ల వారిలోనూ ఈ ఇన్ఫెక్షన్​ తరచూ వస్తుంటుంది. వీరే కాకుండా రైతులు, కూలీలు, నావికులు, జాలర్లు, అథ్లెట్లు, సైనికులు, పరిశ్రమల్లో పని చేసేవారు కూడా ఎక్కువగా దీని బారిన పడుతుంటారు. అలాగే తేమ శాతం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తూ.. కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగేవాళ్లల్లో కూడా ఈ పిట్టెడ్​ కెరటోలైసిస్​ వస్తుంటుంది.

ఇలా చేస్తే కూడా వచ్చే ప్రమాదముంది..

⦁ తరచుగా నీటితో కాళ్లు, చేతులు కడగటం.

⦁ స్నానం చేసిన తర్వాత కాళ్లను గాలికి ఆరనివ్వకపోవడం.

⦁ తడిని పీల్చే సాక్సులు ధరించకపోవడం.

⦁ ఇతరులు వాడిన టవల్స్​ను ఉపయోగించడం.

వీరికీ పిట్టెడ్ కెరటోలైసిస్​తో ముప్పు..

⦁ వేడి, తేమ ప్రదేశాల్లో ఎక్కువగా ఉండటం.

⦁ చేతులకు, కాళ్లకు ఎక్కువగా చెమట పట్టడం.

⦁ అరిచేతులు, అరికాళ్ల చర్మం మందంగా ఉండటం.

⦁ డయాబెటిస్​ సమస్యలు ఉన్నవారు.

⦁ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు.

⦁ వృద్ధుల్లోనూ ఇది ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి.

ఇంటి చిట్కాలతో చెక్​..
Home Remedies For Healing Pitted keratolysis : డాక్టర్లు ప్రిస్క్రైబ్​ చేసే ఎరిథ్రోమైసిన్​, క్లిండామైసిన్​, మ్యుపిరోసిన్​ వంటి యాంటీ బాక్టీరియల్​ మందులు వాడితే కూడా కొద్ది రోజుల్లోనే పిట్టెడ్​ కెరిటోలైసిస్​ నుంచి బయటపడొచ్చు. అయితే సరైన సమయంలో ట్రీట్​మెంట్​ తీసుకోకపోతే బ్యాక్టీరియా మరింత వ్యాప్తి చెందుతుంది. అయితే ఇవి తగ్గిన తర్వాత మళ్లీ పునారవృతం అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ సందర్భాల్లో మనం ఇంట్లో పాటించే చిట్కాల ద్వారా కూడా వీటి బారిన పడకుండా మళ్లీ రాకుండా జాగ్రత్త పడొచ్చు. అదేలాగంటే..

ఇవి పాటించండి..

⦁ వీలైనంత తక్కువ సమయం బూట్లు, సాక్సులు వేసుకోండి.

⦁ తడిని పీల్చే కాటన్​, ఉన్ని సాక్సులను ఎక్కువగా వాడండి.

⦁ బయటకి వెళ్లొచ్చాక కాళ్లను యాంటిసెప్టిక్​ సబ్బుతో శుభ్రంగా కడగండి. వీలైతే రోజుకు రెండు సార్లు ఇలా చేయండి.

⦁ వరుసగా రెండు రోజులు ఒకే రకమైన షూస్​ను వేసుకోవడం మానండి.

⦁ మీ ఫుట్​వేర్​ను, టవల్స్​ను ఇతరులతో పంచుకోకండి.

⦁ సాధ్యమైనంత వరకు కాళ్లు పొడిగా ఉండేలా చూసుకోండి.

గమనిక : ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యపరమైన విషయంలో ఎటువంటి సందేహాలున్నా డెర్మటాలజిస్ట్​ సూచనలు తీసుకోవడం మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.