skin care in summer: చర్మ సంరక్షణ కోసం చాలా మంది ఏవేవో క్రీమ్‌లు, లోషన్లు వాడుతుంటారు. ముఖ్యంగా వేసవిలో ఎండ నుంచి రక్షణకు, ట్యాన్‌ను తగ్గించుకోవడానికి మెడికల్ ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయితే, అందులో కొన్ని చర్మానికి హాని చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. స్టెరాయిడ్ క్రీమ్‌లు ఏ రూపంలో ఉన్నా.. అది చర్మానికి మంచిది కాదని అంటున్నారు.
"మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గాలని కొందరు, చర్మం కాంతివంతంగా మారాలని ఇంకొందరు.. బెట్నోవెట్ వంటి క్రీమ్‌లు ఉపయోగిస్తున్నారు. ఇవి దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. చర్మం సున్నితంగా మారిపోతుంది. ఎండలోకి వెళ్లినప్పుడు చర్మం ఎర్రగా అయిపోతుంది. క్రీమ్‌లను వాడటం మానేస్తే.. చర్మం మళ్లీ పాడైపోతుందేమోనని వాటిని అలాగే కొనసాగిస్తారు. ఇది మంచిది కాదు."
-వైద్య నిపుణులు
స్టెరాయిడ్ క్రీమ్‌ల వల్ల వచ్చే సమస్యలు..
- ముఖం కడిగినప్పుడు ఎర్రగా మారిపోవడం..
- ఎండలోకి వెళ్లినప్పుడు చర్మంపై మంటలు రావడం
- ముఖంపై వెంట్రుకలు పెరిగిపోవడం
- చర్మంపై శాశ్వత వైట్ మాస్కులు రావడం
- ముఖంపై రక్తనాళాలు స్పష్టంగా కనిపించడం
ఏం చేయాలి.. ఏం చేయకూడదు?
- అప్పటివరకు ఉపయోగించిన స్టెరాయిడ్ క్రీమ్‌ను వాడటాన్ని క్రమంగా తగ్గించుకోవాలి.
- మంచి సన్‌స్క్రీన్, మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.
- ఇంట్లోనే చిట్కాలను ప్రయత్నించడం మంచిది కాదు.
- చర్మానికి వచ్చిన సమస్యలను బట్టి డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: మేకప్ కాదు.. 'రెడ్‌వైన్'తోనే మగువలకు అందం!