ETV Bharat / offbeat

సూపర్ స్నాక్ రెసిపీ : కరకరలాడే "పోహా ఫింగర్‌ బైట్స్‌" - ఇలా చేసి పెడితే పిల్లలు ఒక్కటీ మిగల్చరు!

ఎప్పుడూ అటుకులతో పోహా తిని బోర్‌ కొట్టేస్తోందా? - ఈ సూపర్ స్నాక్​ రెసిపీపై ఓ లుక్కేయండి!

Poha Finger Bites Recipe
Poha Finger Bites (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Poha Finger Bites Recipe : చాలా మందికి సాయంత్రం కాగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఒక పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే మమ్మీ తినడానికి స్నాక్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంటారు. ఈ క్రమంలో కొందరు బజ్జీలు, గారెలు, పునుగులు, మరికొన్ని రకాల స్నాక్స్ చేసి ఇస్తుంటారు. అయితే, ఎప్పుడూ రొటీన్ రెసిపీస్ కాకుండా ఈసారి వెరైటీగా ప్లాన్ చేయండి. మీకోసమే ఒక సూపర్ స్నాక్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "పోహా ఫింగర్ బైట్స్". లోపల గుల్లగా, బయట క్రిస్పీగా, క్రంచీగా ఉండే ఈ స్నాక్స్ ప్రత్యేకంగా ఉండి ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చేస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి! ఇంతకీ, వీటి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • కప్పున్నర - అటుకులు
  • మూడు - బంగాళ దుంపలు
  • ముప్పావు చెంచా - పచ్చిమిర్చి ముద్ద
  • పావు కప్పు - కార్న్ ఫ్లోర్
  • ముప్పావు చెంచా - వెల్లుల్లి తరుగు
  • ముప్పావు చెంచా - అల్లం పేస్టు
  • రుచికి సరిపడా - ఉప్పు
  • అర టీస్పూన్ - కారం
  • అర టీస్పూన్ - చిల్లీఫ్లేక్స్
  • అర టీస్పూన్ - మిరియాల పొడి
  • చారెడు - కొత్తిమీర తరుగు
  • వేయించడానికి సరిపడా - నూనె

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టౌపై గిన్నె పెట్టుకొని తగినన్ని వాటర్ పోసి బంగాళదుంపలను ఉడికించుకోవాలి.
  • అవి ఉడికేలోపు మిక్సీ జార్ తీసుకొని అందులో అటుకులను వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఉడికిన బంగాళదుంపలను పొట్టు తీసుకోవాలి. ఆపై వాటిని ఒక మిక్సింగ్ బౌల్​లో వేసుకొని మెత్తగా మాష్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న అటుకుల పొడి, పచ్చిమిర్చి ముద్ద, వెల్లుల్లి తరుగు, అల్లం పేస్టు, కారం, ఉప్పు, చిల్లీఫ్లేక్స్, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
  • అయితే, అలా మిక్స్ చేసుకునేటప్పుడు నీళ్లు పోయనవసరం లేదు. ఒకవేళ మిశ్రమం మరీ గట్టిగా ఉందనుకుంటే రెండు చెంచాలు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి.
  • పిండి బాగా కలిశాక.. కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ తర్వాత అరచేతులకు కొద్దిగా నూనె రాసుకుని ఒక్కో చిన్న ఉండను తీసుకుని సాగదీసి బలపం మాదిరిగా చేసుకొని ప్లేట్​లో ఉంచి పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక మీరు ప్రిపేర్ చేసుకున్న వాటిని.. కొన్ని కొన్ని చొప్పున వేసుకుంటూ గోల్డెన్ కలర్​లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • అనంతరం వాటిని టిష్యూ పేపర్ పరచిన ప్లేట్​లోకి తీసుకొని కాసేపు ఉంచి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే "పోహా ఫింగర్ బైట్స్" రెడీ!
  • ఇక వీటిని వేడి వేడిగా టమాటా సాస్​తో అద్దుకుని తింటుంటే ఆ ఫీలింగ్ సూపర్​గా ఉంటుంది! మరి, ఆలస్యమెందుకు నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి!

ఇవీ చదవండి :

ఈవెనింగ్ స్నాక్స్​గా "ఉల్లి వడలు" - ​ఇలా ప్రిపేర్ చేశారంటే పకోడిని మించిన టేస్ట్!

సూపర్​ స్నాక్​ రెసిపీ "కోడిగుడ్డు కజ్జికాయలు" - ఈ పద్ధతిలో చేస్తే ఒక్కటీ మిగలదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.