"కొవిడ్-19(post covid health issues) తగ్గిన తర్వాత కూడా 10-15% మందికి దీర్ఘకాలం దగ్గు రావటం చూస్తున్నాం. ఇలాంటివారిలో అప్పటికే కాస్త అలర్జీ కూడా ఉంటోంది. కొందరికి కొవిడ్-19 మూలంగా ఊపిరితిత్తుల్లో కణజాలం గట్టిపడొచ్చు (లంగ్ ఫైబ్రోసిస్). ఇది జబ్బు తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. కొవిడ్-19(post covid health issues) తీవ్రమైనవారిలో నాలుగైదు నెలల వరకు లోపల ఇది మచ్చల రూపంలో అలాగే ఉంటుంది. దీంతోనూ దీర్ఘకాలం దగ్గు వేధించొచ్చు. అందువల్ల మీకు ముందుగా మామూలు ఛాతీ ఎక్స్‌రేతో పాటు అలర్జీ పరీక్షలు, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలిపే స్పైరోమెట్రీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. దగ్గు అలర్జీతో వస్తోందా? ఆస్థమాతో వస్తోందా? అనేది వీటితో బయటపడుతుంది. దీని ప్రకారం మందులిస్తే తగ్గిపోతుంది. ఒకవేళ కణజాలం గట్టిపడినట్టయితే నాలుగైదు నెలల వరకు మందులు వాడుకోవాల్సి ఉంటుంది. మీరు పడుకున్నప్పుడు దగ్గు రావటం లేదని అంటున్నారు. నిజంగా జబ్బుతో అయితే పడుకున్నప్పుడూ దగ్గు రావాలి. ఆ మాటకొస్తే ఆస్థమా, అలర్జీతో వచ్చే దగ్గు రాత్రిపూట ఎక్కువగా వస్తుంది కూడా. మీరు అతిగా ఆలోచించటమో, ఇంకేదైనా మానసికంగానో బాధపడుతూ ఉండొచ్చేమోనని అనిపిస్తోంది. దీంతోనూ పగటి పూట దగ్గు రావొచ్చు. పనిచేసే చోట దుమ్ము ధూళి వంటివి పడటం లేదేమో కూడా చూసుకోవాలి. మీరు దగ్గర్లోని పల్మనాలజిస్టును సంప్రదిస్తే తగు పరీక్షలు చేసి, అవసరమైన మందులు సూచిస్తారు. కంగారు పడాల్సిన పనిలేదు."
- డా.మహబూబ్‌ఖాన్, సీనియర్ పల్మనాలజిస్ట్
post covid health issues : కరోనా తగ్గినా ఆ సమస్య వేధిస్తోందా?
కరోనా(post covid health issues) తగ్గిన తర్వాత కూడా చాలా మంది బలహీనంగా ఉంటున్నారు. ముఖ్యంగా కొందరిలో పొడి దగ్గు అలాగే ఉంటోంది. ఇది పగటి వేళ ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. సీటీస్కాన్, ఇతర పరీక్షల రిపోర్టుల్లో అంతా మామూలుగానే ఉన్నా.. దగ్గు వస్తోంది. మీకూ అలాగే ఉంటుందా. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందో.. దీనికి పరిష్కారమేంటో చెబుతున్నారు ప్రముఖ సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ మహబూబ్‌ఖాన్.